తన సమాధి ఎక్కడో ముందే ఫిక్స్ చేసుకున్న రామోజీరావు.. అలా ఉండాలని కోరికంట!

ఈనాడు గ్రూప్స్ చైర్మెన్ చెరుకూరి రామోజీరావు ఈరోజు ( శనివారం) ఉదయం తన తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో

Update: 2024-06-08 08:07 GMT

దిశ, సినిమా : ఈనాడు గ్రూప్స్ చైర్మెన్ చెరుకూరి రామోజీరావు ఈరోజు ( శనివారం) ఉదయం తన తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో రీసెంట్‌గా ఆసుపత్రిలో చేరారు. ఇక ఆయన హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ మరణ వార్త విని ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలోని చాలా మంది రామోజీరావు ఇక లేరు అనే విషయం చాలా దిగ్బ్రాంతికి గురి చేస్తోంది అంటూ ఎమోషనల్ ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పొలిటికల్ లీడర్స్, మోడీ , చంద్రబాబు అందరూ రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కూటమి తరఫున పోటీ చేసి ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన రఘురామ కృష్ణం రాజు రామోజీరావు మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదే విధంగా ఆయన కొన్ని విషయాలను రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే? రామోజీరావు తాను బతికి ఉన్న సమయంలోనే తనను ఎక్కడ సమాధి చేయాలో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు. రామోజీరావు గారు తన సమాధి కోసం రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఓ ప్రదేశాన్ని ఎన్నో సంవత్సరాల క్రితమే ఎంపిక చేసుకున్నారని ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు. అంతే కాకుండా ఆ సమాధి ప్రాంతాన్ని ఓ ఉద్యానవనంలా మార్చాలని ఆయన అన్నారు, ఎందుకంటే రామోజీరావుకు మొక్కలు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన సమాధిని ఓ ఉద్యానవనంలా మార్చాలని తన కోరిక,ఎన్ని కోట్లు నష్టపోయినా రామోజీ ఫిల్మ్ సిటీలాంటిదాన్ని సృష్టించటం మాటలు కాదన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Similar News