రాజకీయాల్లోకి రామ్‌గోపాల్ వర్మ.. పవన్ కల్యాణ్‌కు పోటీగా నామినేషన్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది.
దిశ, సినిమా: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే పార్టీలకు సంబంధించి నామినేషన్‌లు వేసే అభ్యర్థుల జాబితాను కూడా రిలీజ్ చేశారు. అయితే.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ వేసే ప్లేస్‌పై మొన్నటి వరకు సస్పెన్స్ నెలకొంది. భీమవరం నుంచి పోటీ చేస్తారని, తిరుపతి నుంచి పోటీ చేస్తారని, ఇలా కాకినాడ, మచిలీపట్నం అభ్యర్థిగా బరిలో దిగుతున్నారని అనేక వార్తులు వచ్చాయి. ఇక వాటన్నింటికీ బ్రేకులు వేస్తూ.. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి తాను ఎమ్మేల్యేగా పోటీ చేస్తు్న్నట్లు సోషల్ మీడియా మీటింగ్‌లో వెల్లడించారు. అయితే.. ఇలా పవన్ కల్యాణ్ తాను పోటీ చేసే ప్లేస్ గురించి అనౌన్స్ చేశాడో లేదో వెంటనే రామ్ గోపాల్ వర్మ తాను కూడా పోటీ చేస్తున్నట్లు తెలిపాడు.
ఈ మేరకు ‘సడెన్ డిసిషన్.. నేను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. ఆయన ట్వీట్‌పై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా లేక వైసీపీ తరుపున నిలబడతారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరూ మాత్రం ఇది జనసేనానికి జస్ట్ సెటైరికల్ ట్వీట్ మాత్రమే.. రామ్ గోపాల్ వర్మ పోటీ చెయ్యరు అంటూ కొందరు రిప్లైలు ఇస్తున్నారు. ఏదైతేనేం ప్రస్తుతం ఈ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై జనసేనాని ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.