వెంకటేష్‌కు ఆ హీరోయిన్‌తో రాఖీ కట్టించిన రామానాయుడు.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి ఫ్యామిలీ హీరో అనగానే గుర్తుకొచ్చే పేరు విక్టరీ వెంకటేష్.
దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి ఫ్యామిలీ హీరో అనగానే గుర్తుకొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. ఆయన ప్రతి మూవీ కుటుంబ సమేతంగా చూడగలిగేలా ఉంటాయి. అయితే ఇప్పటివరకు వెంకీతో ఎంతోమంది కథానాయికలు నటించినప్పటికీ అందులో సౌందర్య మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరి జంటకు మాత్రం ఫుల్ క్రేజ్ ఉండేది. అయితే అప్పట్లో తెరపై వీరి కెమిస్ట్రీ చూసిన జనాలు నిజంగానే ప్రేమించుకుంటున్నారు అని అపార్థం చేసుకున్నారు. మరికొందరు వెంకటేష్ – నీరజకు విడాకులు ఇచ్చేసి మరి సౌందర్యను పెళ్లి చేసుకోబోతున్నారట అంటూ చాలా వార్తలు పుట్టించారు. దీంతో డి రామానాయుడు వెంకటేష్ – సౌందర్యను ఆఫీస్‌కు పిలిపించి అడిగాడట. అంతే కాదు ‘మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని మాకు తెలుసు. కానీ బయట వాళ్లకు తెలియదుగా. నా కోడలు నీరజ బాధపడటం నాకు ఇష్టం లేదు’ అంటూ సౌందర్య చేత వెంకటేష్‌కు రాఖీ కట్టించారట. ఈ విషయం మరోసారి వైరల్ అవుతోంది.
Read More: Roja Selvaman : ఆ హీరోయిన్ కారణంగానే రోజా స్టార్ హీరోయిన్ అయ్యిందట..