ఊహించని నిర్ణయం తీసుకున్న RAM CHARAN- UPASANA.. బాబాయి కోసం 10 ఎకరాల్లో!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-08-15 08:00 GMT

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ హీరో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజార్జీతో ఘనవిజయం సాధించారు. ప్రస్తుతంపవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ప్రజలకు మంచి చేయడం కోసం పాలనపై పూర్తి దృష్టి సారించారు. ఇకపోతే ఎన్నికల ప్రచారంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాజకీయంగా మాకు ఓ స్వంతూరు ఏర్పడిందని అన్నారు. ఇప్పటి నుంచి మా ఫ్యామిలీకి పిఠాపురమే నేటివ్ ప్లేస్ అన్న విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.

అయితే ఈ దిశగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు రవణం స్వామినాయుడు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఓ విషయం గురించి చెప్పుకొచ్చారు. ‘పిఠాపురలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పది ఎకరాల ల్యాండ్ కొన్నారని వెల్లడించారు. ఆ ప్లేస్‌ ను ఉపాసనకు అప్పగించారని ఆయన తెలిపారు. ఈ 10 ఎకరాల్లో అపోలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి కట్టించనున్నారని అన్నారు. త్వరలోనే శంకుస్థాపన ప్రారంభించనున్నారని చెప్పారు’. ప్రస్తుతం రవణం స్వామినాయుడు ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News