అనంత్ అంబానీ పెళ్లిని ప్రమోషన్స్‌కు వాడిన రాజమౌళి... మహేష్ బాబుకు ఆ సలహా ఇచ్చింది జక్కన్నే...

అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లిని ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే టాపిక్ పై చర్చ నడుస్తోంది. అమెరికన్ మోడల్స్ కర్దాషియన్ సిస్టర్స్, జాన్ సేనాతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరుకాగా

Update: 2024-07-14 05:21 GMT

దిశ, సినిమా: అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లిని ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే టాపిక్ పై చర్చ నడుస్తోంది. అమెరికన్ మోడల్స్ కర్దాషియన్ సిస్టర్స్, జాన్ సేనాతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరుకాగా బాలీవుడ్ నుంచి దాదాపు అందరూ అటెండ్ అయ్యారు. ఇక టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, రామ్ చరణ్, అఖిల్, వెంకీ, పవన్ హాజరయ్యారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన లుక్ కారణంగా మహేష్ ట్రెండ్ అవుతున్నాడు. B టౌన్ సెలబ్రిటీలు, క్రికెటర్లు ఆయనతో ఫొటోలు దిగి.. అప్ లోడ్ చేసిన అందరి స్టేటస్ లోనూ కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో సినిమా రాబోతుండగా.. ఈ మ్యారేజ్ ను ప్రమోషన్స్ గా వాడుకున్నారని ఫన్నీ మీమ్స్ వస్తున్నాయి. ఒకసారి వెళ్లి అందరికీ కనిపించు.. మన సినిమాకు ప్లస్ అవుతుందని జక్కన్న చెప్పడంతో మహేష్ ఈ పెళ్లికి వెళ్ళాడనే అర్థం వచ్చేలా ప్లాన్ చేశారు మీమర్స్. ఇక బాలీవుడ్ బ్యూటీస్ మహేష్ ను చూసి చూపు తిప్పుకోలేక పోతున్నారని.. ఒక్కసారి, ఇంకోసారి అని చూస్తూనే ఉన్నారని కూడా మీమ్స్ రావడంతో ఫుల్లుగా నవ్వుకుంటున్నారు నెటిజన్లు. దీంతో సూపర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుందని మురిసిపోతున్నారు అభిమానులు.


Similar News