తమిళ నిర్మాతల మండలి నిర్ణయంపై నడిగర్ సంఘం అధ్యక్షుడు ఫైర్
తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమిళ నిర్మాతల మండలి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమిళ నిర్మాతల మండలి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళ స్టార్ హీరో ధనుష్‌కు చెక్‌పెట్టేందుకు గాను.. తమిళ నిర్మాతల మండలి హీరో ధనుష్‌తో సినిమా చేయాలంటే.. నిర్మాతల మండలి అనుమతి తప్పనిసరి చేస్తూ నిర్ణయించింది. గతంలో ఆయన పలు సినిమాలకు డ్యాన్సులు తీసుకుని షూటింగ్ పూర్తి చేయడం లేదని ఆయన పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో హీరో దనూష్ ఆగస్టు 15 తర్వాత ఏ కొత్త సినిమా మొదలు పెట్టకూడదని.. సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి విడుదల చేయాలని కోలీవుడ్‌లో సమస్యలపై జాయింట్ యాక్షన్ కమిటీ తేల్చి చెప్పింది. దీంతో ఒక్కసారిగా తమిళ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం చెలరేగింది. ఈ క్రమంలో తమిళ నిర్మాతల సంఘం vs నడిగర్ సంఘం అన్నట్లు పరిస్థితి మారిపోయింది. నిర్మాతల మండలి హీరో ధనుష్ ను టార్గెట్ చేయడంపై నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయంపై నిర్మాతలు నడిగర్ సంఘాన్ని స్పందించలేదని.. ఏకపక్షంగా నటులపై ఆంక్షలు సరికాదని.. నాజర్ అభిప్రాయపడ్డారు. తక్షణమే నిర్మాతల సంఘం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఆదేశించారు.