ఆ ఫోటో షేర్ చేసి మరి.. ఇప్పటికీ నాకు 25 ఏళ్లే అంటున్న నటి ప్రగతి!

నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమె మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె, ఈ మధ్య బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూ తర్వాత నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

Update: 2024-05-30 04:06 GMT

దిశ, సినిమా : నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమె మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె, ఈ మధ్య బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూ తర్వాత నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆ సమయంలో ఆమె ప్లే చేసిన డ్రామా అంతా ఇంతా కాదు మరి. అయితే అందరికీ ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రమే తెలుసు. కానీ ఈమె హీరోయిన్‌గా కూడా నటించి, మెప్పించింది. టీనేజ్‌లో ఉన్న సమయంలో రెండు, మూడు సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ పరంగా హీరోయిన్‌గా సెటిల్ అవుద్దీ అనుకునే లోపే పెళ్లితో హీరోయిన్‌గా ఆమె కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడింది. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రం ఆమె తన సినీ జర్నీ మళ్లీ మొదలు పెట్టి సక్సెస్ అయ్యింది. చాలా సినిమాల్లో ప్రగతి, అమ్మగా, అత్తగా, ఆంటీగా నటించింది. ఇక ఈమె పెళ్లి చేసుకొని, తన భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసిందే.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పార్టీలంటూ ఎంజాయ్ చేస్తూ గడుపుతుంది. అయితే ఈ మధ్య బెంగళూరు రేవ్ పార్టీలో ప్రగతి నోటీసులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తన 25 ఏళ్ల ప్రాయంలో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి క్యాప్షన్‌గా.. మన వయసు ఎంతైనా 25 ఏళ్ల ప్రాయంలానే ఫీల్ అవ్వాలని ఆమె ఆ ఫోటో షేర్ చేశారు. ఆ విధంగా ఆత్మ విశ్వాసం ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై ఒకొక్కరూ ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.


Similar News