ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా.. ?
ఈరోజు ఎన్నికల్లో రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినట్లు ఎవరికైనా తెలుసా
దిశ, సినిమా: ఈరోజు ఎన్నికల్లో రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినట్లు ఎవరికైనా తెలుసా.. తన జీవితంలో విజయం చూడని ఈ అంజనీ పుత్రుడు నేడు చరిత్ర సృష్టించి ఎన్నో కోట్ల మంది గుండెల్లో చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. అయితే కొణిదెల కళ్యాణ్ బాబు గురించి చాలామందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి అవేంటో మనం ఇక్కడ చూద్దాం..
కొణిదెల కుటుంబంలో ఆఖరివాడిగా 1971, సెప్టెంబర్ 2 న జన్మించాడు పవన్ కళ్యాణ్. ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు ఉన్నా కూడా కళ్యాణ్ ఎప్పుడు ఒంటరిగానే ఉండేవాడు. చదువు సరిగ్గా రాలేదు. తన 17 ఏళ్ల వయస్సులో కళ్యాణ్ బాబు మొదటిసారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని ఆయనే ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.. “నాకు ఉబ్బసం ఉంది. తరచుగా ఆసుపత్రిలో చేరడం వల్ల ఒంటరిగా ఫీలయ్యేవాణ్ణి. నేను సోషల్ పర్సన్ ని కాను. 17 ఏళ్ళ వయసులో, పరీక్షల ఒత్తిడి నా డిప్రెషన్‌ను మరింత పెంచింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మా అన్నయ్య లైసెన్స్డ్ రివాల్వర్‌తో నా ప్రాణం తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాను.. కానీ, అది గమనించిన మా వదిన సురేఖ, అన్నయ్య నాగబాబు నన్ను కాపాడారు. ఈ విషయం పెద్దన్నయ్య చిరంజీవికి చెప్పారు. ఆయన నన్ను కూర్చోపెట్టి.. ఇలాంటి పనులు చేయకు నా కోసం బ్రతుకు నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు కానీ, బ్రతికి ఉండు చాలు అని చెప్పాడు. అప్పటి నుండి నేను పుస్తకాలు చదువుతూ నా ఒత్తిడిని తగ్గించుకున్నాను” అని చెప్పుకొచ్చాడు.
అయితే అలా ఉండే మనిషి ప్రజల సేవకి అంకితమవ్వడానికి సిద్ధపడ్డాడు. తన సిగ్గు, బిడియం, భయాన్ని పక్కన పెట్టి ప్రజల మధ్యకు వచ్చాడు. కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్న హీరో.. రోడ్లపై చెప్పులు లేకుండా నడిచాడు. తల్లిని, భార్యను అనరాని మాటలు అన్నా కూడా భరించి ప్రజల కోసం నిలబడ్డాడు. పదేళ్లు శ్రమించి ఈరోజు ఈ హోదాలో నిలబడ్డాడు. సినిమాలు వదిలేసి.. లగ్జరీ లైఫ్ ను వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, అభిమానులను కూడా వదిలేసి ప్రజల సమస్యలే తన సమస్యలుగా పోరాట పటిమతో ముందుకు సాగుతున్న.. కొణిదెల పవన్ కళ్యాణ్ అలియాస్ జనసేనాని. మరి ముందు ముందు ఏపీలో పవన్ ఎలాంటి మంచి కార్యాలను చేసి ప్రజల్లో గుండెల్లో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.