పిఠాపురంలో పవన్ గెలుపు.. ఎల్లిపోకే శ్యామల అంటూ ట్వీట్ చేసిన నిర్మాత

ఏపీ ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయభేరి మోగించారు. 70 వేలకు పైచిలుకు మెజారిటీతో ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అయితే ఈసారి ఏపీ ఎన్నికల ప్రచారంలో

Update: 2024-06-04 09:52 GMT

దిశ, సినిమా : ఏపీ ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయభేరి మోగించారు. 70 వేలకు పైచిలుకు మెజారిటీతో ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అయితే ఈసారి ఏపీ ఎన్నికల ప్రచారంలో యాంకర్ శ్యామల వైసీపీ తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆమె ఓ సెలబ్రిటీ అయిఉండి, పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించలేడు, ఆయాసపడటం, కోపం తప్ప ఆయనకు ఇంకేం తెలియదు. తాను రాజకీయాలకు పనికి రాడు, వైసీపీనే ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తుంది అంటూ కామెంట్స్ చేసింది. అయితే ప్రస్తుతం పవన్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఎవరూ ఊహించని విధంగా ఏపీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. దాదాపు కూటమిదే విజయం అవుతుందనే విధంగా ఫలితాలు ఉన్నాయి. ఈ క్రమంలో బేబీ చిత్ర నిర్మాత ఎస్‌కెఎన్ యాంకర్ శ్యామలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ.. ఆ సినిమాలో వెళ్లిపోకే శ్యామల.. ఏమీ బాగాలేదే అంటూ పాటను షేర్ చేశారు. జనసేనాని విజయం సందర్భంగా ఆయన ఈ వీడియోను షేర్ చేశారు. ఇక పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతుండటంతో ఆయన అభిమానుల ఆనందం మాటల్లో చెప్పలేకుండా ఉంది.


Similar News