Paris Hilton: బాత్‌రూమ్‌లోనూ ఆమెను వదలని నిర్మాత?
చాలా ఏళ్ల క్రితం హార్వేతో జరిగిన ఈ భయంకర సంఘటన గురించి పారిస్ హిల్టన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
దిశ, సినిమా : ప్రముఖ అమెరికన్ మీడియా పర్సన్, బిజినెస్ ఉమెన్ పారిస్ హిల్టన్.. హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టెయిన్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పటికే పలువురు మహిళలు హార్వేపై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల క్రితం హార్వేతో జరిగిన ఈ భయంకర సంఘటన గురించి పారిస్ హిల్టన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘గాలాకు ముందు రోజు నేను వైన్‌స్టీన్‌ను కలిశా. అప్పుడు నాకు19 ఏళ్లు. ఓ హోటల్లో నా ఫ్రెండ్‌తో లంచ్ చేస్తున్నపుడు నా టేబుల్ దగ్గరకు వచ్చి మీరు నటి కావాలనుకుంటున్నారా? అని అడిగాడు. అవునని చెప్పాను. టీనేజీలో ఉండడంతో అతని మాటతీరు చూసి మంచివాడనుకున్నా. తర్వాత నాతో దురుసుగా ప్రవర్తించాడు. నేను బాత్రూమ్‌లోకి వెళ్లిన వదలకుండా చాలాసేపు బాత్రూమ్ డోర్ కొట్టాడు. బలవంతంగా డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. భయంతో వణికిపోతున్న నేను గట్టిగా అరవడంతో సెక్యూరిటీ వచ్చి అతన్ని లాక్కెళ్లిపోయారు’ అంటూ ఆవేదనగా చెప్పుకొచ్చింది. అయితే పారిస్ వ్యాఖ్యలను వెంటనే హార్వే కొట్టిపారేయడం విశేషం.