'ఠెహర్ జా' ప్రజల హృదయాలను గెలుచుకుంది: Palak Muchhal

ప్రముఖ గాయని పాలక్ ముచ్చల్ ఇటీవల విడుదలైన తన మ్యూజిక్ వీడియో 'ఠెహర్ జా'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..

Update: 2022-11-29 08:55 GMT

దిశ, సినిమా : ప్రముఖ గాయని పాలక్ ముచ్చల్ ఇటీవల విడుదలైన తన మ్యూజిక్ వీడియో 'ఠెహర్ జా'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రిచా రవి సిన్హా - ఆశిష్ భాటియా నటించిన ఈ వీడియో సాంగ్ ద్వారా ప్రజల మనసు గెలుచుకోగలిగానని తెలిపింది. ప్రతిభావంతులైన బృందం, అద్భుతమైన ప్రొడక్షన్ హౌస్‌లో భాగమైనందుకు సంతోషిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోలో హాట్ లుక్స్‌తో కుర్రాళ్లను అట్రాక్ట్ చేసిన రిచా.. పాలక్ మ్యూజిక్ వీడియోలో భాగం కావడం సంతోషంగా ఉందని, తాను వ్యక్తిగతంగా పాలక్ ముచ్చల్‌కి పెద్ద అభిమానినని చెప్పింది. 'పాపులర్ సింగర్‌కు సంబంధించిన పాటలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా. అద్భుతమైన సాహిత్యంతో కూడిన అందమైన పాట. ప్రేక్షకులు దీన్ని ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. సంగీతం చాలా ఆత్మీయంగా ఉంది. అభిమానుల స్పందన చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతుంది' అని తెలిపింది. 

ఇవి కూడా చదవండి : 'అన్ స్టాపబుల్: సీజన్2': తాజా ఎపిసోడ్‌కు ఆ నలుగురు

ఇవి కూడా చదవండి : పొగ మంచులో చిక్కుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..

Tags:    

Similar News