పద్మవిభూషణ్, బాబాయ్ పెళ్లి, పవన్ కళ్యాణ్ గెలుపు.. లక్కీ మహాలక్ష్మిలా మారిన క్లీంకార..

రామ్ చరణ్, ఉపాసనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2012లో వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

Update: 2024-06-05 02:41 GMT

దిశ, సినిమా: రామ్ చరణ్, ఉపాసనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2012లో వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కాగా వీరి పెళ్లైనా పదేళ్లకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ బుజ్జాయికి క్లీంకార అని నామకరణం కూడా చేశారనే విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా ఆమె పుట్టిన ఏడాది (జూన్ 20, 2023) నుంచి మెగా ఫ్యామిలీకి చాలా గుడ్ న్యూస్‌లు వినిపించాయి. 2023, నవంబర్ 1న బాబాయ్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలాగే మనవరాలు ఇంటికి వచ్చిన కొన్నాళ్ళకే తాత మెగాస్టార్ చిరంజీవికి దేశ అత్యున్నత రెండో పౌర పురస్కారం 'పద్మవిభూషణ్' అవార్డు దక్కింది. ఆ తర్వాత కొన్ని రోజులకే చిన్న తాత పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేగా గెలిచి, ఏపీ పాలిటిక్స్‌లో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అయ్యారు. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ, 21 స్థానాల్లో కూడా అఖండ విజయం అందుకుంది. అయితే ఇవన్నీ కూడా క్లీంకార పుట్టిన తర్వాతే జరగడంతో మెగా ప్రిన్సెస్, మెగా ఫ్యామిలీకి లక్కీ మహాలక్ష్మిలా మారిందని పోస్టులు పెడుతున్నారు మెగా అభిమానులు..

కాగా క్లీంకార పుట్టడానికి కొన్ని నెలల ముందు RRR మూవీ, ఆస్కార్ అవార్డు అందుకుంది. పనిలో పనిగా ఆస్కార్ అవార్డుని కూడా క్లీంకార ఖాతాలోనే వేసేస్తున్నారు అభిమానులు. అయితే కొణిదెల క్లింకారాను మీడియాకి, సోషల్ మీడియాకి దూరంగా పెంచాలని అనుకుంటున్నారు రామ్ చరణ్, ఉపాసన. అందుకే ఇప్పటిదాకా పాపకు సంబంధించిన ఏ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.


Similar News