దీపికను భర్త ముందే అక్కడ పట్టుకున్న ఆ సెలబ్రిటీ.. ఎలా పర్మిషన్ ఇచ్చిందంటూ ట్రోలింగ్

' కల్కి 2898 AD ' తో సూపర్ సక్సెస్ అందుకున్న దీపికా పదుకొనె త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. బేబీ బంప్ తోనే ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె డెడికేషన్ కు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

Update: 2024-07-11 15:42 GMT

దిశ, సినిమా: ' కల్కి 2898 AD ' తో సూపర్ సక్సెస్ అందుకున్న దీపికా పదుకొనె త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. బేబీ బంప్ తోనే ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె డెడికేషన్ కు విమర్శకుల ప్రశంసలు లభించాయి. సినిమాలో నటనకు హండ్రెడ్ మార్క్స్ పడిపోయాయి. అయితే తాజాగా అంబానీ ఇంట జరిగిన అనంత్ - రాధికా మర్చంట్ సంగీత్ కు హాజరైంది దీపిక. మీడియా కంటపడకుండా ఈవెంట్ కు వెళ్లి.. పలువురు సెలబ్రిటీలతో ఫొటోలు దిగింది. ఈ క్రమంలో భర్త రణ్ వీర్ సింగ్, బాలీవుడ్ స్టార్స్ ఫ్రెండ్ ఒర్రితో కలిసి పిక్ తీసుకుంది.

అయితే ఈ పిక్చర్ లో దీపిక, రణ్ వీర్ మధ్య నిలుచున్నాడు ఒర్రి. ఇంత వరకు బాగానే ఉన్నా ఆమె పొట్టపై భర్త మాదిరిగా ఒర్రి చేయి వేయడాన్ని విమర్శిస్తున్నారు నెటిజన్లు. అసలు ఎలా పర్మిషన్ ఇచ్చిందని తిడుతున్నారు. ఇలాంటివి చేస్తే రణ్ వీర్ మాత్రం ఎలా సహిస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ ఫొటోపై నెటిజన్స్ నెగెటివ్ కామెంట్స్ చేయగా.. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే తప్పుగానే కనబడుతుందని అంటున్నారు దీపిక అభిమానులు. కాగా ఈ ఇన్ సైడ్ పిక్చర్స్ ఒర్రి షేర్ చేయడం విశేషం.



Similar News