కేవలం హిందూ ఆలయాలే ప్రభుత్వ ఆధీనంలో.. మరి చర్చిలు, మసీదులు ఎందుకుండవు .. ఇదేనా సెక్యులరిజం : రేణు దేశాయ్
రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. ఈమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ‘బద్రి’ సినిమాలో నటించారు.
దిశ, సినిమా: రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. ఈమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ‘బద్రి’ సినిమాలో నటించారు. ఆ తర్వాత జాని మూవీలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని విడిపోయారు. పవర్ స్టార్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. కానీ రేణు దేశాయ్ మాత్రం తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు పై ఫోకస్ పెట్టింది.
కాగా రేణు దేశాయ్ ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్నప్పుడు రేణు దేశాయ్ అంతగా పాపులారిటీ దక్కించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఆయనకు విడాకులు ఇచ్చిందో అప్పటి నుంచి రేణుదేశాయ్ తన దైన స్టైల్‌లో ఘాటుగా కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో భారత దేశంలో సెక్యులరిజం, ప్రస్తుత పరిణామాలపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో భాగంగా దేశంలోని చర్చిలు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో ఉండవని, కేవలం హిందూ ఆలయాలు మాత్రమే గవర్నమెంట్ అండర్‌లో ఉంటాయని అలాంటప్పుడు ఇండియా సెక్యులర్ దేశం ఎలా అవుతుందని రేణు ప్రశ్నించారు. ఆలయాలను నడిపే ట్రస్ట్‌లు, ఇతర కమిటీలకు ఇతర మతాలకు సారథ్యం వహించడం ఏంటని ఆమె నిలదీశారు.
దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బాలీవుడ్ స్టార్స్ సైతం మాట్లాడేందుకు భయపడే విషయాలను ప్రస్తావించిందని కొందరు కొనియాడారు. మరికొందరు పవన్ కళ్యాణ్ ఏసుక్రీస్తు ఫోటోతో ఉన్న పిక్స్‌ను షేర్ చేస్తూ ఆయన క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇంతకీ రేణు దేశాయ్ ఎవరిని, ఏ పార్టీని, ఏ సంస్థను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రేణు దేశాయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.