పంతులమ్మగా మారిన నిత్యామీనన్.. వీడియో వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి చెప్పక్కర్లేదు.

Update: 2023-01-19 11:42 GMT
పంతులమ్మగా మారిన నిత్యామీనన్.. వీడియో వైరల్
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, మలయాళంతో పాటు హిందీలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చాలామంది నటీమణులు కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్ని భారీగా డబ్బు సంపాదిస్తారు.

అలా కాకుండా స్పెషల్ ఈవెంట్‌లో పాల్గొని సరదాగా గడుపుతుంటారు. కానీ, నిత్యామీనన్ మాత్రం అందరిలా కాకుండా కొత్త సంవత్సరం సందర్భంగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ గడిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News