మహిళా దర్శకులతో సినిమా.. గొప్ప అనుభూతి పొందుతామన్న Nawazuddin Siddiqui

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ.. మహిళా దర్శకులతో పనిచేయడం తన కెరీర్‌కు మేలు చేసిందంటున్నాడు. 'హడ్డీ' సినిమాతో సరికొత్త అవతార్‌లో దర్శనమివ్వబోతున్న ఆయన వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ కెరీర్ అనుభవాలను పంచుకుంటున్నాడు..Latest Telugu News

Update: 2022-09-04 09:28 GMT
మహిళా దర్శకులతో సినిమా.. గొప్ప అనుభూతి పొందుతామన్న Nawazuddin Siddiqui
  • whatsapp icon

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ.. మహిళా దర్శకులతో పనిచేయడం తన కెరీర్‌కు మేలు చేసిందంటున్నాడు. 'హడ్డీ' సినిమాతో సరికొత్త అవతార్‌లో దర్శనమివ్వబోతున్న ఆయన వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ కెరీర్ అనుభవాలను పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే 'మోతీచూర్ చక్నాచూర్' చిత్రానికి దేబమిత్ర బిస్వాల్, 'మంటో' కోసం నందితా దాస్, 'తలాష్'కు రీమా కగ్తీ, 'బాంబే టాకీస్' కోసం జోయా అక్తర్‌తో కలిసి పనిచేయడం సరికొత్త అనుభూతినిచ్చిందని వారిపై ప్రశంసలు కురింపించాడు.

'స్త్రీలు ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారు. దయతో కూడిన సున్నిత మనస్తత్వం కలిగివుంటారు. ప్రతిదానిలో అందాన్ని మాత్రమే చూస్తారని గ్రహించాను. పురుషులు శక్తివంతంగా ఉన్నప్పటికీ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో స్త్రీలతో పోటీపడలేరు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 'హడ్డీ'లో తానొక లింగ మార్పిడి మహిళగా కనిపంచబోతున్నందుకు ప్రజలతోపాటు కుంటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారన్నాడు. 

Tags:    

Similar News