కష్టపడి పని చేయడానికి నేనెప్పుడూ సిగ్గుపడను: నవాజుద్దీన్

బాలీవుడ్ సీనియర్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ బాక్సాఫీస్ లెక్కలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Update: 2022-12-01 12:48 GMT
కష్టపడి పని చేయడానికి నేనెప్పుడూ సిగ్గుపడను: నవాజుద్దీన్
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ బాక్సాఫీస్ లెక్కలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. వినోద పరిశ్రమలో జయాపజయాలు సాధారణమన్న ఆయన.. కష్టపడి తీసిన సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోయినా, వసూళ్లు రాబట్టకపోయినా నటులు ఎప్పుడూ పట్టుదలతో పని చేస్తూనే ఉంటారని చెప్పాడు. అయితే బాక్సాఫీస్ లెక్కలను పరిగనలోకి తీసుకుని నటీనటుల పని అయిపోయిందని అంచనా వేయడం సరైనది కాదన్న నవాజ్.. తను నటించిన 'ఫోటోగ్రాఫ్', 'మోతీచూర్ చక్నాచూర్', 'హీరోపంతి 2'ల ఫలితాలు పేలవంగా ఉన్నప్పటికీ తన కష్టాన్ని గుర్తించి పని ఇస్తున్నారని చెప్పాడు. 'సినిమా పని చేయకపోవచ్చు. కానీ, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎప్పుడూ పని చేస్తాడు. ఒడిదొడుకులు ఎదురైనపుడు షారుఖ్‌ను ఉదాహరణగా తీసుకుంటా. సినిమాల అపజయాలపై నేనెప్పుడూ బాధపడలేదు. కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడను. నా పనిని నిజాయితీగా చేస్తున్నానా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటా' అని చెప్పుకొచ్చాడు. చివరగా ఫ్లాప్ అయినప్పుడు తాము ఏ దర్శకుడిని నిందించమని, 'ఈ యాక్టర్ ఫిల్మ్ ఫ్లాప్ అయింది' అని అభిమానులే హేళన చేస్తారని చెప్పాడు.

READ MORE

డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన చిత్తూరు చిరుత 

Tags:    

Similar News