ఆ కారణంతోనే సోదరి సినిమాలో నటించలేదు: Nani

టాలీవుడ్ స్టార్ హీరో నాని తన సోదరి గంట దీప్తి డైరెక్షన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన సమర్పణలో దీప్తి తెరకెక్కించిన ఆంథాలజీ చిత్రం 'మీట్‌ - క్యూట్‌' నవంబర్ 25 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం కానుంది.. Latest Telugu News

Update: 2022-11-22 07:29 GMT
ఆ కారణంతోనే సోదరి సినిమాలో నటించలేదు: Nani
  • whatsapp icon

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో నాని తన సోదరి గంట దీప్తి డైరెక్షన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన సమర్పణలో దీప్తి తెరకెక్కించిన ఆంథాలజీ చిత్రం 'మీట్‌ - క్యూట్‌' నవంబర్ 25 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న నాని.. 'ఈ కథ దీప్తి కాకుండా ఎవరు చెప్పినా తీస్తా. ఒకవేళ అజ్ఞాతవ్యక్తి ఫోన్‌ నంబర్‌ కూడా రాయకుండా స్ర్కిప్టు పంపితే.. అతన్ని వెతికి పట్టుకుని మరీ తీస్తా. దీప్తికి దర్శకత్వం అనుభవం లేదన్నది నిజమే. కానీ, స్ర్కిప్టులోనే సినిమా మొత్తం చూపించేసింది. అందుకే దర్శకురాలిగా తను మాత్రమే ఈ కథకు న్యాయం చేస్తుందనిపించింది. ఇందులో ఉన్న 5 కథలు అందరికీ బాగా నచ్చుతాయి. నేను కూడా నటిద్దామనుకున్నా. కానీ, నేనుంటే అంచనాలు పెరిగిపోతాయని వద్దనుకున్నా. నాకు సరిపోయే పాత్ర కూడా లేదు. అందుకే నేను ఆ సాహసం చేయలేదు' అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా దర్శకురాలు దీప్తి స్పందిస్తూ.. ఇద్దరు అపరిచిత వ్యక్తులు తొలిసారి కలసినప్పుడు వాళ్ల సంభాషణలు ఎలా ఉంటాయో చెప్పే థీమ్‌తో ఈ ఆంథాలజీ రూపొందించామని, దర్శకత్వ అనుభవం లేకపోయినా సోదరుడు నాని సపోర్ట్‌తో ఆంథాలజీ ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చానని తెలిపింది.

Tags:    

Similar News