ఆ అనారోగ్య సమస్యతో పుట్టిన పవన్ కళ్యాణ్.. అమ్మకు ఫోన్ చేసి ఇప్పటికీ అది అడుగుతాడు : నాగబాబు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరు, పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే తన తల్లి గురించి కూడా ఆయన ఓపెన్‌గా చెప్పుకొచ్చాడు.

Update: 2024-06-09 08:15 GMT

దిశ, సినిమా : తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరు, పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే తన తల్లి గురించి కూడా ఆయన ఓపెన్‌గా చెప్పుకొచ్చాడు.

నాగబాబు మాట్లాడుతూ.. అమ్మకి ఎక్కువగా అన్నయ్య అంటే ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే అమ్మకు అన్నయ్య పనిలో చాలా సహాయం చేసేవారు. ఇక కళ్యాణ్ బాబు మాత్రం మా అందరికీ చాలా స్పెషల్. ఎందుంటే కళ్యాణ్ చిన్నోడు, అలాగే చిన్నప్పుడు బలహీనంగా, అనారోగ్యంతో పుట్టాడు. దీంతో అమ్మ తనను ఇప్పటికీ చాలా కేరింగ్‌గా చూసుకుంటుంది. కానీ నన్ను మాత్రం ఎక్కువగా కొట్టేది అని చెప్పుకొచ్చారు. అలాగే కళ్యాణ్ బాబు అంటే మా అందరికీ చాలా ఇష్టం, ముఖ్యంగా అమ్మకు, మేము ముగ్గురం కలిసి ఉండాలని తాను ఎక్కువగా కోరుకుంటుంది. కానీ కళ్యాణ్ మాత్రం ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. అయినా తన కోసం అమ్మ ఏదో ఒక వంట చేసి పంపిస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు పులావక అంటే చాలా ఇష్టం. తినాలనిపించే ప్రతిసారి అమ్మకు ఫోన్ చేసి, ఏదైనా వండి పంపొచ్చు కదా అమ్మా అని చిన్నపిల్లాడిలా అడుగుతాడు. అమ్మ కూడా కళ్యాణ్ బాబు ఎప్పుడెప్పుడు అడుగుతాడా అని ఎదురు చూస్తుంటుంది. తన కోసమే స్పెషల్‌గా వండి పంపిస్తుందని తెలిపారు. అలాగే అమ్మకి కోడళ్లు ఎవరు వంట చేసినా నచ్చదు అంటూ నవ్వుతూ తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను గెలుపును ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగానే ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


Similar News