పాపం నాగచైతన్య.. చివరకు సమంత దారిలోకే వచ్చాడుగా!
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ కపుల్, తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకొని, మనస్పర్థల కారణంగా విడిపోయారు.
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ కపుల్, తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకొని, మనస్పర్థల కారణంగా విడిపోయారు.
ఇక వీరు విడిపోయారు అని తెలిశాక, అటు సమంత ఫ్యాన్స్, ఇటు అక్కినేని ఫ్యాన్స్ షాక్‌కు గురి అయ్యారు. వీరు మళ్లీ కలుసుకోవాలని కోరుకున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే, వీరు విడిపోయి ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. నాగచైతన్య వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ, బిజీగా ఉంటే, సమంత మాత్రం మయోసైటీస్ వ్యాధి బారిన పడి కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకొని, సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి, ఇప్పుడిప్పుడే మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుంది.
అయితే ప్రస్తుతం నాగచైతన్య మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య తన సినిమా మంచి సక్సెస్ కావాలని ప్రత్యేక పూజలు చేస్తున్నాడంట. దీంతో సమంత ఫ్యాన్స్ నాగచైతన్యపై తెగ కామెంట్స్ చేస్తున్నారు.
విడిపోయిన సరే చైతూ సమంతనే ఫాలో అవుతున్నాడు. అంటూ ట్రోల్ చేస్తున్నారు. నాగచైతన్య, సమంత కలిసి ఉన్నప్పుడు సామ్ తన సినిమాల కోసం స్పెషల్‌గా పూజలు చేయించేదంట. ఆ సమయంలో చై కూడా సామ్‌తో పూజ చేసేవాడంట. అయితే ఇప్పుడు సమంతతో విడిపోయినా సరే, చై సమంతలానే, సామ్ సలహా మేరకు ఆ పూజలు చేస్తున్నాడు, పాపం చైతన్య, చివరకు సమంత దారిలోకే వచ్చాడంటూ ఎద్దేవా చేస్తున్నారు.