Mouni Roy : మౌని రాయ్ అందాల జాతర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ..
బాలీవుడ్ భామ మౌని రాయ్ అంటేనే యూత్‌లో అదో రకం క్రేజీ. స్మాల్ స్ర్కీన్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ పరిశ్రమ వరకు ఆమె ప్రస్థానం అందరికీ సుపరిచితమే.
దిశ, సినిమా : బాలీవుడ్ భామ మౌని రాయ్ అంటేనే యూత్‌లో అదో రకం క్రేజీ. స్మాల్ స్ర్కీన్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ పరిశ్రమ వరకు ఆమె ప్రస్థానం అందరికీ సుపరిచితమే. తన నటన, అభినయం, హావభావాలతో అలరించడంలో మౌని రూటే సపరేటు.
ఎప్పడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మౌని రాయ్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అండ్ హాటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ యువ హృదయాలను కొల్లగొట్టే పనిలో బిజీగా ఉంటుందన్న టాక్ ఉంది. ఇంతకాలం సమ్మర్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తూ బోల్డ్ లుక్స్ పంచుకున్న భామ ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటూ సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోతోంది.
ఇంతకాలం వెకేషన్లకు తిరిగిన హాటెస్ట్ పిక్స్‌తో పాటు లేటెస్ట్ అంశాలను అభిమానులతో పంచుకుంటున్న మౌని రాయ్ మరోసారి రెచ్చిపోయింది. రీసెంట్గా మల్టీకలర్ ఫ్లవర్స్ అండ్ పింక్ కలర్ బాటమ్ క్లాథింగ్తోపాటు మ్యాచింగ్ కలర్ టాప్ పీస్తో ఉన్న బోల్డ్ లుక్స్ ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘హాటీ.. హాటెస్ట్.. స్టన్నింగ్’ అంటూ బోల్డ్ కామెంట్స్‌తో మౌని రాయ్‌ను తెగ పొగిడేస్తున్నారు.