ఆ హీరో ముద్దు బాగుంటుంది.. అందుకే అన్ని సార్లు లిప్ లాక్ చేశా.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

'ఆపద్బాంధవుడు' హీరోయిన్ మీనాక్షీ శేషాద్రి అందం ఇప్పటికీ పదిలంగానే ఉంది. 90లలో తన బ్యూటినెస్ తో స్క్రీన్ పై మెస్మరైజ్ చేసిన ఆమె..

Update: 2024-06-04 14:22 GMT

దిశ, సినిమా: 'ఆపద్బాంధవుడు' హీరోయిన్ మీనాక్షీ శేషాద్రి అందం ఇప్పటికీ పదిలంగానే ఉంది. 90లలో తన బ్యూటినెస్ తో స్క్రీన్ పై మెస్మరైజ్ చేసిన ఆమె.. బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీని కూడా ఏలింది. పద్ధతిగా కనిపిస్తూనే మోడ్రన్ గర్ల్ గా మెప్పించింది. అయితే ముందుగా లిప్ లాక్ సీన్స్ కు ససేమిరా అన్న ఈ బ్యూటీ.. హీరో సన్నీ డియోల్ తో మాత్రం చాలా సినిమాల్లో ముద్దు సీన్లలో నటించింది. దీంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయింది. అయితే తాజాగా ఓ టెలివిజన్ షో గెస్ట్ గా వచ్చిన తనను చూసిన ప్రేక్షకులు ఇప్పటికే అంతే అందంగా ఎలా ఉందని ఆశ్చర్యపోతున్నారు.

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి.. సన్నీ డియోల్ తో లిప్ లాక్ వెనుక ఉన్న సీక్రెట్ చెప్పింది. ' నిజానికి ముద్దు పెట్టుకోవడం అంటే నరాలు తెగినంత పని అయిపోయేది. చాలా భయమేసేది. కానీ 1987లో వచ్చిన 'డకైట్ ' మూవీలో ఆయన లిప్ లాక్ డీల్ చేసిన విధానం బాగుంది. మంచి ఈక్వేషన్, అండర్ స్టాండింగ్ ఉండేది. అందుకే తర్వాత ' ఘాయల్ ', ' 'ఘటక్ ', 'దామిని ' లాంటి సినిమాల్లోనూ ఆయనతో ముద్దు సీన్లు చేశా ' అని చెప్పుకొచ్చింది.


Similar News