పెళ్లికి ముందే కడుపు.. అత్తింటి వారికి తెలిశాక.. హీరోయిన్ పరిస్థితి దారుణం..

సాహసం శ్వాసగా సాగిపో హీరోయిన్ గుర్తుందా. నాగ చైతన్య పక్కన బబ్లీగా కనిపించిన మంజిమా మోహన్.. ఈ మధ్యే కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్ ను పెళ్లి చేసుకుంది.

Update: 2024-05-30 06:53 GMT

దిశ, సినిమా: సాహసం శ్వాసగా సాగిపో హీరోయిన్ గుర్తుందా. నాగ చైతన్య పక్కన బబ్లీగా కనిపించిన మంజిమా మోహన్.. ఈ మధ్యే కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్ ను పెళ్లి చేసుకుంది. ఈయన 90లలో వచ్చిన 'అన్వేషణ' హీరో కార్తీక్ కొడుకు. కాగా వీరిద్దరి పెళ్లి ప్రముఖులంతా తరలిరాగా అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా గౌతమ్, మంజిమ హీరోహీరోయిన్లుగా నటించిన 'దేవరకట్టం' సెట్స్ లో కలిశారు. తొందరగానే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకునే వీరిద్దరినీ చూస్తే ప్రేమికులనే డౌట్ తోటినటులకు రాలేదు. కానీ పెళ్లి అనౌన్స్ చేసే సరికి షాక్ అయ్యారు. మొత్తానికి అలా ఒక్కటయ్యారు.

అయితే అప్పటికే మంజిమ అనారోగ్యం కారణంగా లావు అయిపోవడంతో అంత హాండ్సమ్ పర్సనాలిటీతో ఈమె పెళ్లి ఏంటని విమర్శలు వచ్చాయని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంకొందరు ఆమె పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అని తన మామ గారికి చెప్పారని బాధపడింది. అయితే ఇవన్నీ సింగిల్ గా ఉన్నప్పుడు లైట్ తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు బాధిస్తున్నాయని తెలిపింది. కానీ తన భర్త అన్ని వేళలా తనకు సపోర్ట్ ఇస్తాడని.. ఆయన వల్లే స్ట్రాంగ్ గా మారుతున్నానని చెప్పుకొచ్చింది.


Similar News