సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మలాలా.. ఆ స్పెషల్ సిరీస్ తోనే..

యంగెస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ గా రికార్డు క్రియేట్ చేసిన పాకిస్థాన్ కు చెందిన మలాలా యూసఫ్ జాయ్.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ

Update: 2024-06-01 12:34 GMT

దిశ, సినిమా: యంగెస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ గా రికార్డు క్రియేట్ చేసిన పాకిస్థాన్ కు చెందిన మలాలా యూసఫ్ జాయ్.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. బ్రిటిష్ షో 'We Are Lady Parts' సెకండ్ సీజన్ లో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ కౌ గర్ల్ గెటప్ లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కానీ ఆడియన్స్ అంతగా ఇంప్రెస్ అయినట్లు కనిపించడం లేదు. తలపై హ్యాట్ ధరించి గుర్రం సవారీ చేస్తున్న మలాలాను చూసి చాలా మంది చిరాగ్గా ఉన్న ఎమోజీలు పోస్ట్ చేశారు.

'బలహీనులకు కోపం తేవడం ఈమె పని అనుకుంటా ', ' ఎందుకు ఇంత టార్చర్ మాకు ' , ' అయినా ఈమె ఇప్పుడే యాక్ట్ చేస్తుందా ఏంటి.. ముందు నుంచి అదే పనిలో ఉందిగా ' అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా నిజా మందూర్ తెరకెక్కించిన ఈ సిరీస్.. గురువారం నుంచి అమెరికాలో NBCUniversalలో ప్రసారం అవుతుండగా, UKలో Channel 4లో స్ట్రీమింగ్ కు రానుంది.


Similar News