ట్రోలింగ్‌కు గురి అవుతున్న మహేష్ బాబు భార్య.. అసలేమైందంటే?

మహేష్ బాబు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి ఫ్యామిలీ అంటే చాలా మందికి మంచి అభిమానం ఉంటుంది. ఇక ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయినా పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీ కోసం

Update: 2024-05-31 09:21 GMT

దిశ, సినిమా : మహేష్ బాబు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి ఫ్యామిలీ అంటే చాలా మందికి మంచి అభిమానం ఉంటుంది. ఇక ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయినా పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీ కోసం టైమ్ కేటాయిస్తూ.. వారి ఆలన పాలన చూసుకుంటూ ఓ గృహిణిలా చక్కగా నడుచుకుంటుంది. అయితే ఎప్పుడూ ఈ నటిపై ట్రోలింగ్ జరగలేదు. కానీ తాజాగా నమ్రత శిరోద్కర్ ని సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్‌కి గురి అవుతోంది. నమ్రతపై కొందరు మండిపడుతున్నారు.

ఎందుకంటే? మహేష్ బాబు గారాల పట్టీ సితారా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. చిన్న వయసులోనే ఆమె స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఏకంగా జ్యూవెల్లరీ యాడ్ చేసి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంది అంటే ఆమె స్టేటస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఇక సితార ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంది. అయితే ఇంత చిన్న వయసులోనే సితార సోషల్ మీడియా స్టార్‌గా మారడానికి నమ్రతే కారణం అంటున్నారు ట్రోలర్స్. ఎందుకు నమ్రత సితారను ఇంత త్వరగా ఇలా స్టార్‌ను చేశావు, సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండేలా చేస్తున్నావు. ఇది తన ఎడ్యుకేషన్ లైఫ్ కి ప్రాబ్లం అవుతుందని ఆలోచించలేదా? ఇతంతా నీ ముంబై తెలివితేటలా అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Similar News