సదాకు పెళ్లికాకముందే.. పెళ్లి చేసుకొని ఏకంగా ఓ బిడ్డకు తల్లైన తన చెల్లి ఫోటోస్ వైరల్!

నితిన్ హీరోగా, సదా హీరోయిన్‌గా తేజా దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ ఆరోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక అప్పట్లో ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అందరినీ

Update: 2024-05-21 09:24 GMT

దిశ, సినిమా : నితిన్ హీరోగా, సదా హీరోయిన్‌గా తేజా దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ ఆరోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక అప్పట్లో ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అందరినీ తెగ ఆకట్టుకుంది. ముఖ్యంగా సదా చెల్లిగా నటించి చైల్డ్ ఆర్టిస్ట్ తన నటనతో ఎంతో మంది మనసు దోచుకుంది. అందుకే ఇప్పటికీ ఈ నటి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. దీంతో ఈ బ్యూటీకి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా సరే ఎంతో ఇంట్రెస్ట్‌గా చూస్తుంటారు.

జయం సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ పేరు యామినీ శ్వేత నాయుడు. ప్రస్తుం అప్పటి ఆ నటిని ఇప్పుడు చూస్తే అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే గుర్తు పట్టని విధంగా మారిపోయింది. తాజాగా ఈ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడమే కాకుండా ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ నటి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండా చదువు పై ఫోకస్ చేసినట్లు సమాచారం. చదువు పూర్తి అయ్యాక తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని యంగ్ ఏజ్ లోనే వివాహం చేసుకుంది. భర్తతో పాటు యామిని శ్వేతా నాయుడు విదేశాల్లో సెటిల్ అవ్వడమే కాకుండా ఈ నటికి ఓ పాప కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో ముచ్చటించే ఈ బ్యూటీ, ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ నటి తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అందులో తన భర్త, పాపతో దర్శనం ఇచ్చింది. ఇక ఇది చూసిన వారందరూ మీ అక్కకు ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే చెల్లి పెళ్లి చేసుకొని పిల్లలను కూడా కనేసిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Similar News