కన్నీళ్లు ఆగడం లేదు ఇలా జరగడం చాలా బాధగా ఉంది.. బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్

బిగ్‌బాస్ బ్యూటీ శ్వేతా వర్మ పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఇటీవల తనను బాడీ షేమింగ్ చేసిన వారిపై ఫైర్ అవుతూ ఓ పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచింది.

Update: 2024-03-04 03:40 GMT

దిశ, సినిమా: బిగ్‌బాస్ బ్యూటీ శ్వేతా వర్మ పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఇటీవల తనను బాడీ షేమింగ్ చేసిన వారిపై ఫైర్ అవుతూ ఓ పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచింది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా, శ్వేతా వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఓ స్పానిష్ మహిళ ట్రావెలింగ్ చేస్తుండగా ఆమెను కొందరు గ్యాంగ్ రేప్ చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయంపై శ్వేతా స్పందిస్తూ.. ‘‘ కన్నీళ్లు ఆగడం లేదు. నన్ను ఈ ఘటన ఎంతగానో బాధ పెట్టింది. ఆడదాని శరీరాన్ని తాకాలని, రేప్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది. ఆమెను ఎందుకు బాధ పెట్టాలి. ఆమె భర్తను ఎందుకు అలా గాయపర్చాలి అలా చేసిన వారి మీద నాకు చాలా కోపం వస్తుంది. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండండి మేము మీ వెంట ఉంటాం. తప్పు చేసిన రాక్షసులకు శిక్ష పడేలా చేద్దాం. అసలు ఇలా జరగకుండా ఉండాల్సింది. మా దేశంలో జరగడం నన్ను బాధిస్తుంది. మేము ఫెయిల్ అయ్యాము క్షమించండి. ఇంతకంటే నేను ఇంకా ఏమీ చెప్పలేను’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆ భార్యాభర్తల వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం శ్వేతా పోస్ట్ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Similar News