ఓటీటీలో సరికొత్త రికార్డ్ సాధించిన వరుణ్ ‘నింద’ సినిమా..

వరుణ్ సందేశ్(Varun Sandesh) హీరోగా వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘నింద’(Nindha).

Update: 2024-12-28 13:40 GMT

దిశ, సినిమా: వరుణ్ సందేశ్(Varun Sandesh) హీరోగా వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘నింద’(Nindha). ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం(Rajesh Jagannatham) దర్శకత్వం వహించి, నిర్మించారు. ఈ సినిమాలో అన్నీ, శ్రేయ, తనికెళ్ల భరణి(Tanikella Bharani), భద్రం వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాటోగ్రాఫర్ రమీజ్ నవీన్ అద్భుతమైన విజువల్స్, అనిల్ కుమార్ చేసిన ఎడిటింగ్‌.. నింద మూవీని మాస్టర్ క్లాస్ గా నిలబెట్టాయి. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 6న ETV విన్‌లో విడుదలై ఓటీటీలో దూసుకుపోతుంది. అప్పటి నుంచి ట్రెండ్ అవుతుంది. తాజాగా, ‘నింద’ 35 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసింది. అంతేకాకుండా ఓటీటీలో సరికొత్త రికార్డు సాధించింది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి  ఎమిరేట్స్, మలేషియన్(Malaysian) ఎయిర్‌లైన్స్‌లో ప్రసారం చేయడానికి ఆమోదం పొందింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




Read More...

ప్రభాస్, విజయ్‌లపై కన్నడ హీరో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?






 


Tags:    

Similar News