విడాకులు తీసుకున్న స్టార్ సింగర్స్.. అఫిషియల్ నోట్ రిలీజ్ .. అదే కారణం

హీరో, మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ భార్య సైంధవితో విడాకులు తీసుకున్నట్లు అఫిషియల్ గా ప్రకటించాడు. 11 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డు వేస్తున్నట్లు

Update: 2024-05-14 02:55 GMT

దిశ, సినిమా: హీరో, మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ భార్య సైంధవితో విడాకులు తీసుకున్నట్లు అఫిషియల్ గా ప్రకటించాడు. 11 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డు వేస్తున్నట్లు రాసుకొచ్చాడు. తమ కమిట్మెంట్స్, కెరీర్ లో ముందుకు సాగాలనే తపన.. ఈ నిర్ణయానికి కారణమైందని తెలిపాడు. ఒకవేళ ఇలాగే ఉంటే మనశ్శాంతి కరువయ్యేలా ఉందని.. ఇద్దరం అర్థం చేసుకుని ఎవరి దారి వారు చూసుకుంటున్నట్లు వివరించాడు. పూర్తి అండర్ స్టాండింగ్ తో ఈ డెసిషన్ తీసుకున్న తాము సామరస్యంగా బంధానికి బై బై చెప్తున్నామని.. మీడియా, సోషల్ మీడియా, ఫ్రెండ్స్ తమను అర్థం చేసుకొని ఈ విషయంలో కాస్త ప్రైవసీ ఇవ్వాలని కోరాడు.

కాగా GV ప్రకాష్ సంగీత దర్శకత్వంలో చాలా మూవీస్ కు సైంధవి పాటలు పాడింది. ది బెస్ట్ అనిపించుకుంది. ఈ క్రమంలోనే ఆమె ప్రేమలో పడిపోయిన ఆయన.. ప్రపోజ్ చేసి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. అయితే GV హీరోగా కెరీర్ లో ఎదుగుతుండటం, ఈ క్రమంలో బిజీ అయిపోవడం ఈ విడాకులకు కారణం అయి ఉండొచ్చు అనే అనుమానాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి.


Similar News