నాగార్జున అన్న అని పిలిచే ఏకైక వ్యక్తి అతనేనంట?

అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ఉన్న క్రేజే వేరు. ఇక ఈ మధ్య నాగార్జున సినిమాలు ఎక్కువగా రావడం లేదు, వచ్చినా అంతగా సక్సెస్ కాకపోవడంతో అక్కినేని అభిమానులు కాస్త అసహనం వ్యక్తం

Update: 2023-08-06 08:26 GMT

దిశ, వెబ్‌డెస్క్ :  అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ఉన్న క్రేజే వేరు. ఇక ఈ మధ్య నాగార్జున సినిమాలు ఎక్కువగా రావడం లేదు, వచ్చినా అంతగా సక్సెస్ కాకపోవడంతో అక్కినేని అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాగ్ బిగ్ బాస్‌పై ఫోకస్ చేయడం వల్లనే మూవీస్ మీద కాన్సట్రేషన్ చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో నాగార్జునకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేమిటంటే? నాగార్జున తన జీవితంలో ఇప్పటివరకు ఒకే ఒక్క హీరోని అన్నా అంటూ ప్రేమగా ఆప్యాయతగా మనసారా పిలిచారట . ఆ హీరో మరెవరో కాదు హరికృష్ణ . నందమూరి ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోగా రాజ్యమేలేసిన హరికృష్ణ.. అంటే మొదటి నుంచి నాగార్జునకు చాలా చాలా ఇష్టమట. అందుకే ఆయనను ఆప్యాయంగా అన్నా అని పిలిచేవారట.అంతేకాదు ఆయన రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోవడంతో నాగార్జున చాలా చాలా బాధపడ్డారట . తన సొంత అన్నయ్య చనిపోయారు అని..ఆ లోటు వేరే వారు తీర్చలేనిది అని చెప్పుకొచ్చారు.


Similar News