పవిత్రను అందుకే పెళ్లి చేసుకున్నా.. అసలు విషయం చెప్పేసిన నరేష్ !

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర వ్యవహారం గత కొద్ది కాలంగా హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2024-01-25 05:24 GMT
పవిత్రను అందుకే పెళ్లి చేసుకున్నా.. అసలు విషయం చెప్పేసిన నరేష్ !
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర వ్యవహారం గత కొద్ది కాలంగా హాట్ టాపిక్‌గా మారింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన పవిత్రతో డేటింగ్ ఉన్నారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా నరేష్ భార్య రమ్య రఘుపతి వీరిద్దరిని ఓ హోటల్‌లో రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంది. వీరిద్దరు నటించిన మళ్లీ పెళ్లి సినిమాను విడుదల చేయొద్దని కేసు కూడా పెట్టింది. ఈ కేసు కోర్ట్ విచారణకు చేరుకోవడంతో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే సీక్రేట్‌గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

నరేష్, పవిత్రలకు ఇప్పటికే పెళ్లై పిల్లలు ఉండటంతో వీరి పెళ్లి గురించి తెలిసినవారు రకరకాలుగా అనుకున్నారు. ప్రస్తుతం ఈ జంట తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో డబ్బు కోసమే పవిత్ర పెళ్లి చేసుకుందని వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా, నరేష్ స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ డబ్బు కోసం పవిత్ర నన్ను పెళ్లి చేసుకుందనే విమర్శలలో ఎలాంటి నిజం లేదు. నా కంటే ఎక్కువ డబ్బు ఆమె కుటుంబ సభ్యుల దగ్గరే ఉంది. వాళ్ల డబ్బు కోసం నేనే ఆమెను పెళ్లి చేసుకున్నాను అనుకోవచ్చు కాదా? మనీ అనేది సెకండరీ. ఆమె క్యారెక్టర్ నాకు నచ్చింది. ఆమెలో మా అమ్మను చూశాను. ప్రేమ గానీ, ధైర్యం చెప్పడం గానీ వంటలు ఇలా అన్నింట్లో నాకు మా అమ్మను గుర్తు చేస్తుంది.

డబ్బు అనేది ప్రశ్నే కాదు. మాకున్న డబ్బును ఇండస్ట్రీ కోసం ఖర్చు పెట్టాం. అంతేతప్ప వెనుక వేయలేదు. మా అందరికీ రేపు ఏంటి? అనే ప్రశ్న తలెత్తిన రోజులు ఉన్నాయి. దేవుడు అనుగ్రహించాడు. నేను ఇప్పుడు బిలియనీర్. నేను బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నాను. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా. మూడు నాలుగు తరాలు బతకడానికి ఆలోచించాల్సిన అవసరం లేనంత డబ్బు ఉంది. నా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాను. ఇప్పటి వరకు 14 దేశాలు తిరిగాను. మొత్తం 30 దేశాలు తిరగాలనేదే నా కోరిక’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News