Mahisha : ‘మహిష’ టీజర్ ఎలా ఉందంటే?

‘మహిష’ టీజర్ ఎలా ఉందంటే

Update: 2024-10-03 02:34 GMT

Full View

దిశ, వెబ్ డెస్క్ : పృథ్వీరాజ్, వైష్ణవి, ప్రవీణ్ KV, యషిక, మౌనిక ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న మూవీ ‘మహిష’. స్క్రీన్ ప్లే పిక్చర్స్ పతాకంపై ప్రవీణ్ KV హీరోగా, దర్శకుడిగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకొని విడుదలకు రెడీగా ఉంది. టీజర్ విడుదల చేయగా తాజాగా, ఈ మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి హీరో ప్రవీణ్ KV మాట్లాడుతూ.. " ఈ సినిమా తీయడానికి చాలా కష్ట పడ్డాము. సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. మేము విడుదల చేసిన మా మూవీ టీజర్ కు రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. ఇవి జెన్యూన్ వ్యూస్. మహిష మూవీలో ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ఒక మెసేజ్ కూడా ఉంది. త్వరలోనే సినిమా విడుదల డేట్ ను కూడా అనౌన్స్ చేస్తామని "తెలిపారు.

Tags:    

Similar News