అయ్య బాబోయ్!..సంపూర్ణేష్ బాబు ఆస్తుల విలువ తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే..
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో కామెడి టైమింగ్తో రెండు రాష్ట్రాల ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
దిశ, సినిమా: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో కామెడి టైమింగ్తో రెండు రాష్ట్రాల ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. నరసింహ చారీగా సిద్దిపేటలో గోల్డ్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న సంపూర్ణేష్ అనుకోకుండా సీరియల్ లో ఒక చిన్న వేషం వేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత తన సొంత ఊరిలో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు.. అందులో చిన్న అవకాశం వస్తే, తన రోల్ తో మెప్పించాడు. దీంతో తట్టా బుట్టా సర్దుకొని హైదరాబాద్ కు వచ్చేసి కనిపించిన ప్రతీ సినిమా ఆఫీస్ లో తన ఫోటోలు ఇచ్చి అవకాశం కోసం ఎదురు చూశాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశం వస్తే చాలనుకున్నా సంపూకు ఏకంగా హీరో ఛాన్స్ రావడంతో ఆయన సంతోషం అంతా ఇంతా కాదు. కట్ చేస్తే.. హృదయ కాలేయం హిట్టయి సంపూకు ఓ రేంజ్ లో పాపులారిటీ వచ్చింది. ఇలా నరసింహ చారీ నుంచి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ వరకు సిని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, మలుపులు దాటుకొని వచ్చి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత సింగం 123, కొబ్బరి మట్ట, కాలీ ఫ్లవర్ ఇలా కామెడీ సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. చివరగా తమిళ బ్లాక్ బస్టర్ మండేలా రీమేక్ మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో కనిపించాడు. ఇక సంపూ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20 నుంచి 30 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఇక తన ఆస్తుల విషయానికొస్తే.. సినిమాల్లో, తన వృత్తి పరంగా కూడబెట్టింది రూ.5 కోట్ల వరకు ఉంటుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. కాగా ఒకరికి కష్టం వచ్చిందని తెలిస్తే చాలు, తన వంతు సహాయం ఖచ్చితంగా చేస్తుంటాడు.