విడాకులు తీసుకోనున్న హీరోయిన్..! ఇన్‌స్టాలో భర్త పేరు, ఫొటోలు డిలీట్ చేయడంతో

ఈ మధ్య టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో భారీ భారీ డైలాగులు చెప్పిన వారు సైతం అనంతరం విడాకులు తీసుకుని విడిపోయి చెప్పినంత సులువు కాదంటూ నచ్చ చెబుతున్నారు.

Update: 2024-06-02 05:17 GMT

దిశ, సినిమా: ఈ మధ్య టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో భారీ భారీ డైలాగులు చెప్పిన వారు సైతం అనంతరం విడాకులు తీసుకుని విడిపోయి చెప్పినంత సులువు కాదంటూ నచ్చ చెబుతున్నారు. ముఖ్యంగా సినీ, టీవీ ఇండస్ట్రీలో అయితే తరచూ విడాకుల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలోనే తాజాగా ఈ విడాకుల జాబితాలో మరో టాలీవుడ్ హీరోయిన్ చేరనుందనే వార్త తెగ రచ్చ చేస్తుంది. ఆ బ్యూటీ మరెవరో కాదు మేం వయసుకు వచ్చాం సినిమాతో 'దిల్' అనే ముస్లిం అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నీతి టేలర్. దీని తర్వాత పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ వంటి మూవీలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి పోయి అక్కడ బుల్లితెరపై బిజీబిజీగా మారిపోయింది. అయితే ఈ భామ ఆర్మీ అధికారి పరీక్షిత్ బవాను ప్రేమించి 2020లో వీరు కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.


ఇదిలా ఉండగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఇటీవల తన అభిమానులకు షాక్ ఇచ్చింది. సడన్ గా ఇన్స్టా గ్రామ్‌ లో తన పేరు పక్క నుంచి భర్త ఇంటి పేరుని.. ఇద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫోటోలు, వీడియోలను కూడా తొలగించింది. దీంతో ఆమె ఫాలోవర్స్ షాక్ తిన్నారు. నీతి టేలర్ విడాకులు తీసుకోనుందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత.. అబద్ధమెంతో.. అన్నది తెలియాలంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు స్పందించే వరకు ఆగాల్సిందే.


Similar News