మెగాస్టార్ చెంప పగలగొట్టిన హీరోయిన్.. డైరెక్టర్ బెదిరింపులకు భయపడి..

వహీదా రెహమాన్.. 90వ దశకంలో ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.

Update: 2024-04-02 06:36 GMT

దిశ, సినిమా: వహీదా రెహమాన్.. 90వ దశకంలో ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్. నేషనల్ అవార్డ్స్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్, పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో గౌరవించబడిన ఆమె.. డాక్టర్ కావాలనే డ్రీమ్ ఉన్నా తండ్రి చనిపోవడంతో కుటుంబం కోసం సినీ ఇండస్ట్రీకి ఎంటర్ అయింది. ముందుగా కోలీవుడ్ అవకాశాలు దక్కించుకున్న వహీద.. తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దేవ్ ఆనంద్, రాజ్ కపూర్, సునీల్ దత్, రాజేష్ ఖన్నా లాంటి లెజెండరీస్ సరసన మెరిసింది.

ఇక అమితాబ్ బచ్చన్ తో నటించేటప్పుడు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి ఓ ప్రోగ్రామ్ లో షేర్ చేసుకుంది ఈ నటి. 'రేష్మ ఔర్ షేరా' సినిమాలో మెగాస్టార్ బచ్చన్ ను చెంప దెబ్బ కొట్టే సీన్ ఉందని.. అయితే తాను ఫుల్ ఫోర్స్ తో కొడతానని ముందుగానే ఆయనను ప్రిపేర్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అలాగే చేసినా బిగ్ బి దాన్ని పర్సనల్ గా తీసుకోకపోగా.. తన వర్క్ కమిట్మెంట్ పై కాంప్లిమెంట్స్ ఇచ్చాడని తెలిపింది.

అయితే ఏ సినిమా చేసినా తను కండిషన్స్ పెట్టేదాన్నని.. బాడీ కనిపించేలా చీర కట్టుకోవాలని ఓ డైరెక్టర్ డిమాండ్ చేసినా ససేమిరా అనడంతో.. తనను ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News