ఇండియాలోనే అత్యధిక ఆస్తులున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఎన్నికోట్లు కూడబెట్టాడంటే..
ఏఆర్ రెహమాన్.. ఈ పేరు వినగానే ఎవరికైనా వెంటనే మధురమైన సంగీతం, అలరించే పాటలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే.. అతను మ్యూజిక్ ఇచ్చిన ప్రతీపాట ప్రేక్షకుల హృదయాన్ని తాకుతుందనే టాక్ ఉంది.
దిశ, సినిమా : ఏఆర్ రెహమాన్.. ఈ పేరు వినగానే ఎవరికైనా వెంటనే మధురమైన సంగీతం, అలరించే పాటలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే.. అతను మ్యూజిక్ ఇచ్చిన ప్రతీపాట ప్రేక్షకుల హృదయాన్ని తాకుతుందనే టాక్ ఉంది. 1990లలో అయితే తెలుగు, తమిళ్, హిందీ ఇలా.. అన్ని భాషల సనిమాలకు మ్యూజిక్ అందించి సంగీత రారాజుగా మరింత ఫేమస్ అయ్యాడు రెహమాన్. నాడు తెలుగులో వచ్చిన రోజా, జెంటిల్‌మెన్, బాంబే, ప్రేమికుడు, జీన్స్, దిల్‌సే వంటి సూపర్ హిట్ మూవీస్‌లో అద్భుతమైన సంగీత స్వరాలతో ప్రేక్షకులను మైమరిపించిన తీరు అతన్ని వరల్డ్‌వైడ్ ఫేమస్ చేసేసిందని సంగీత ప్రియులు చెప్తుంటారు.
ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా గ్రామీ, ఆస్కార్ వంటి నేషనల్ అవార్డులు, మరెన్నో ప్రయివేటు అవార్డులతో పాటు పద్మభూషణ్ బిరుదు అందుకున్నాడు ఏఆర్ రెహమాన్. ఇదిలా ఉండగా ప్రస్తుతం అతని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏంటంటే.. సంగీతంలోనే కాదు.. జీవితంలోనూ ఏఆర్ రెహమాన్ సక్సెస్‌ఫుల్ వ్యక్తి అని, ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక ఆస్తులున్న మ్యూజిక్ డైరెక్టర్ అని పలువురు కొనియాడుతున్నారు. ఇప్పటికిప్పుడు అతని దగ్గర స్థిరాస్థి, చరాస్థి అన్నీ కలుపుకొని సుమారు రూ. 1,728 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఉందట. ఈ విషయాన్ని ఓ నేషనల్ మీడియా పేర్కొన్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుండగా, ఇది చూసిన నెటిజన్లు సంగీత రారాజే కాదు, జీవితంలోనూ, ఆర్థిక క్రమ శిక్షణలోనూ ఏఆర్ రెహమాన్ ఆదర్శనీయుడని తెగ పొగిడేస్తున్నారు అభిమానులు.
Read More..
అందుకే రెండేళ్లు గ్యాప్ వచ్చింది.. యంగ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్