మత్తుమందిచ్చి రేప్.. గర్భం తీయించిన సినీ నిర్మాత అరెస్ట్

తాజాగా ఒక యువతిపై కూల్ డ్రింకులో మత్తుమందు మాత్రలు వేసి అత్యాచారం చేయడమే కాకుండా ఆమె పిండాన్ని తొలగించిన సినీ నిర్మాతను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

Update: 2024-06-04 03:08 GMT

దిశ, సినిమా: తాజాగా ఒక యువతిపై కూల్ డ్రింకులో మత్తుమందు మాత్రలు వేసి అత్యాచారం చేయడమే కాకుండా ఆమె పిండాన్ని తొలగించిన సినీ నిర్మాతను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. వివరాల్లోకి వెళితే

చెన్నైలోని కొలత్తూరు ప్రాంతానికి చెందిన సినిమా నిర్మాత మహమ్మద్ అలీ (30) కిల్ అయనంబాక్కంలో సినిమా నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు. కొరటూరు ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువతి గతేడాది సెప్టెంబర్‌లో మహమ్మద్ అలీ కార్యాలయంలో చేరగా ఆమెకు మాయ మాటలు చెప్పి కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి ఆమెను లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో గత నెల మే 13న ఆ యువతి అంబత్తూరు ఆల్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో వేధింపులపై ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో సినిమా నిర్మాణ సంస్థ నడుపుతున్న మహ్మద్ అలీ తనకు పెళ్లయిందన్న విషయాన్ని దాచి పెట్టి నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడని పేర్కొంది.

అదే విధంగా నాకు తెలియకుండా సాఫ్ట్ డ్రింక్ లో మత్తు మాత్రలు కలిపి నాపై అత్యాచారం చేశాడు, అంతే కాకుండా వీడియో రికార్డ్ చేశాడు. దీంతో నేను గర్భం దాల్చడంతో పౌష్టికాహార మాత్రలని అబార్షన్ మాత్రలు కొని ఇచ్చి కడుపులో పెరుగుతున్న పిండాన్ని తొలగించాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. నన్ను అన్ని విషయాల్లో దోపిడీ చేసినందువల్ల అతడిని అరెస్టు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం పోలీసులు విచారణ జరపగా ఆ ఆరోపణ నిజమే అని రుజువైంది. అనంతరం చిత్ర నిర్మాత మహమ్మద్ అలీపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిన్న అరెస్ట్ చేశారు. అనంతరం అంబత్తూరు కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.


Similar News