పవన్ కళ్యాణ్ గెలుపులో నీ హంగామా మిస్ అవుతున్నాం.. బండ్ల గణేష్ ఆరోగ్యంగా తిరిగి రావాలంటున్న ఫ్యాన్స్!

బండ్ల గణేష్‌కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనను తన దేవుడిగా భావిస్తాడు. ఇక సందర్భం వచ్చిన ప్రతి సారి పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ తన ప్రేమను కురిపిస్తూనే ఉంటాడు. దేవరా.. దేవుడా

Update: 2024-06-04 04:53 GMT

దిశ, సినిమా : బండ్ల గణేష్‌కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనను తన దేవుడిగా భావిస్తాడు. ఇక సందర్భం వచ్చిన ప్రతి సారి పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ తన ప్రేమను కురిపిస్తూనే ఉంటాడు. దేవరా.. దేవుడా అంటూ ప్రతి సందర్భంలో ఆయన పవన్ కళ్యాణ్‌కు తన ప్రేమను తెలుపుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తుంటాడు. అంతే కాకుండా స్టేజ్‌పై ఆయన మైక్ పట్టిందంటే చాలు. పవన్ పై తనకు ఉన్న భక్తి చాటుతూనే ఉంటాడు. పవన్, పవర్ స్టార్, జనసేనాని అంటే ఓ వ్యసనం.. చచ్చి బూడిదయ్యే వరకు వదలలేం. రాముడికి హనుమంతుడు ఎలానో పవన్‌కు నేను అలాం అంటూ చెప్పుకొస్తాడు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గెలవాలని ఆయన ఎంతగానో కోరుకున్నాడు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. మరీ ముఖ్యంగా ఏపీలో పిఠాపురంలో పవన్ గెలుపు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ గెలవడం బండ్లగణేష్‌కు చాలా సంతోషం ఇచ్చే వార్త. ఈరోజు ఆయన ట్విట్టర్‌లో చేసే సందడి, హంగామా మాములుగా ఉండదు. తన ప్రేమను కుమ్మరిస్తూ ఆయన వదిలే డైలాగ్స్ చూస్తే ఆ క్రేజే వేరుంటుంది. కానీ ఆయన సందడి చూద్దాం అనుకున్న వారికి మాత్రం నిరాశే మిగిలిపోయింది.

బండ్ల గణేష్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల ఫలితాల వేళ నీ ఆనందం మేము చూడలేకపోతున్నాం. దేవర, దేవుడు , జనసేనాని అంటూ మీరు ట్విట్టర్‌ర్లో చేసే సందడి, ఎలివేషన్స్ మేము మిస్ అవుతున్నాం. మీరు త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాం అంటూ తన అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి


Similar News