విడాకులు తీసుకున్నా.. సమంత కోసం ఇప్పటికీ ఆ పని చేస్తున్న నాగచైతన్య!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), నాగచైతన్య(Naga Chaitanya) ‘ఏమాయ చేసావే’ సినిమాతో ప్రేమించుకున్నారు.

Update: 2024-12-03 05:30 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), నాగచైతన్య(Naga Chaitanya) ‘ఏమాయ చేసావే’ సినిమాతో ప్రేమించుకున్నారు. కొద్ది కాలం తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి కాపురం ఎక్కువకాలం నిలువలేదు. కొన్నేళ్లకే విడాకులు(Divorce) తీసుకుని విడిపోయారు. ఇక వీరి విడాకుల వార్తను చూసిన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఈ జంట విడిపోవడానికి కారణాలేంటో తెలియనప్పటికీ మళ్లీ కలిసిపోతారని అంతా భావించారు. కానీ అది జరగలేదు. ఇక విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంత మయోసైటీస్(Myositis) కారణంగా సినిమాలకు పూర్తిగా దూరం అయింది.

ఇక నాగచైతన్య మాత్రం శోభిత(Sobhita Dhulipala)ను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే గత కొద్ది కాలంగా నాగచైతన్య, సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. విడిపోయిన తర్వాత కూడా నాగచైతన్య సమంత కోసం ఆమెకు ఇష్టమైన పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు ఎంతో ఇష్టమైన చెట్లను ఇప్పటికీ నాగచైతన్య(Naga Chaitanya) భద్రంగా చూసుకుంటున్నాడట. వాటిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడని టాక్. ఏ జంట అయినా విడాకులు తీసుకుంటే కొందరు వారికి నచ్చినవన్నీ పడేస్తారు కానీ చైతు అలాగే ఉంచుకోవడంతో ఆమె జ్ఞాపకాలతోనే ఉన్నాడని అంటున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read...

Naga Chaitanya: మరికొన్ని గంటల్లో శోభితతో పెళ్లి.. హాట్ టాపిక్‌గా మారిన నాగచైతన్య పోస్ట్! 

Tags:    

Similar News