రామోజీరావు సక్సెస్‌లో ఈటీవీ 9pm న్యూస్ కీలక పాత్ర!

ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగిపోయారు. మార్గదర్శి చిట్స్‌తో ప్రారంభించి, రామోజి ఫిల్మ్ సిటీ వరకు ఈయన సాధించిన విజయాలెన్నో

Update: 2024-06-08 05:49 GMT

దిశ, సినిమా : ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగిపోయారు. మార్గదర్శి చిట్స్‌తో ప్రారంభించి, రామోజి ఫిల్మ్ సిటీ వరకు ఈయన సాధించిన విజయాలెన్నో. ముఖ్యంగా ఈనాడు, వసుంధర పబ్లికేషన్స్, ఈటీవీ, ఈటీవీ2, ఈటీవీ కన్నడ,సితార, అన్నదాత, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ వీటన్నింటిని ఆయన రన్ చేస్తూ మంచి సక్సెస్ అందుకున్నాడు.

అయితే రామోజీరావు కెరీర్ సక్సెస్‌లో ETV9PM న్యూస్ కీలకం అంటున్నారు పలువురు. ఎందుకంటే రోజంతా జరిగిన ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం కోసం,30 నిమిషాల్లో ఆ సమాచారాన్ని తెలిపే, ఈటీవీ9పీఎమ్ బులిటెన్ కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారు. ఇది ఇప్పటికీ అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌ను కలిగి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో న్యూస్ ఛానెల్స్ వస్తున్నాయి. ఇప్పటకీ కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నాయి. కానీ దీనిపై ఉన్న ఆధారణ మాత్రం అస్సలే తగ్గడం లేదు. 1995లో రామోజీరావు ఈటీవీని ప్రారంభించగా, ఇది కొన్ని రోజుల్లోనే మంచి ప్రజాధారణ పొందింది. దీని తర్వాత ఎన్నో న్యూస్ ఛానెల్స్ వచ్చాయి కానీ ఇది మాత్రమే చాలా మందికి ఫేవరెట్ అయిపోయింది. రాత్రి తొమ్మిది అయ్యిందంటే చాలు ఈటీవీ న్యూస్ చూడటం ప్రతి ఒక్కరికీ అలవాటుగా మారిపోయింది.


Similar News