ఆ వీడియో చూస్తే దు:ఖం తన్నుకొస్తుంది.. నా కుంటుబాన్ని కాపాడండి
'సాక్రెడ్ గేమ్స్' ఫేమ్ ఎల్నాజ్ నొరౌజీ ఇరాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై స్పందించింది. మషా అమిని మరణం తర్వాత హింసాత్మక నిరసనలు వెల్లువెత్తుతుండగా.. అక్కడ చిక్కుకున్న తన కుటుంబం కోసం ఆందోళనగా ఉందని చెప్పింది..Latest Telugu News
దిశ, సినిమా : 'సాక్రెడ్ గేమ్స్' ఫేమ్ ఎల్నాజ్ నొరౌజీ ఇరాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై స్పందించింది. మషా అమిని మరణం తర్వాత హింసాత్మక నిరసనలు వెల్లువెత్తుతుండగా.. అక్కడ చిక్కుకున్న తన కుటుంబం కోసం ఆందోళనగా ఉందని చెప్పింది. రీసెంట్‌గా మీడియాతో మాట్లాడుతూ ఇరాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడటం ఇప్పుడు చాలాముఖ్యమన్న నటి.. అక్కడ ఏ జరుగుతుందో బయటి ప్రజలకు తెలియకుండా, ఎవరినీ కమ్యూనికేట్ చేయకుండా ఇంటర్నెట్‌ను కట్ చేసినట్లు తెలిపింది. దీంతో తన కుటుంబంతో ఏ రకమైన కమ్యూనికేషన్ లేదని, ప్రతి మార్గం బ్లాక్ చేయబడిందంటూ ఎమోషనల్ అయింది.
ఈ సమయంలో మనందరీ వాయిస్ పెంచి అక్కడి పరిస్థితులను ప్రపంచం దృష్టికి తీసుకొస్తేనే ఏదైనా మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని అభిమానులను కోరింది. ఇక మూడు రోజులుగా తనవాళ్లతో మాట్లాడలేదన్న ఎల్నాజ్.. తనకు ప్రస్తుతం కన్నీళ్లు మాత్రమే మిగిలాయని, ఆ దేశానికి సంబంధించిన ఏ వీడియో చూసినా దు:ఖం తన్నుకొస్తుందని వాపోయింది. చివరగా తొందరలోనే మంచి రోజులు రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. ఇటీవల మషా అమిని అనే 22 ఏళ్ల అమ్మాయి హిజాబ్ సరిగా ధరించలేదని, దీంతో తమ మత ఆచారాలను కించపరిచిందంటూ పోలీసులు ఆరెస్ట్ చేయగా లాకప్‌లోనే ఆమె మరణించింది. అయితే ఆమె తల, ఒంటిపై గాయలుండటంతో కొట్టి చంపేశారంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
Also Read: దీపికతో మళ్లీ అలా చేయాలనుంది.. ఒక్క చాన్స్ కావాలంటున్న స్టార్ హీరో