Amaran Movie: రేపు ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన సినిమా ‘అమరన్’(Amaran).

Update: 2024-12-04 03:17 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన సినిమా ‘అమరన్’(Amaran). రాజ్ కుమార్ పెరియసామి(Rajkumar Periyasamy) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్(Kamal Haasan), ఆర్. మహేంద్రన్(R, Mahendran), సోనీ పిక్చర్స్ ఇంటర్‌నేషన్ ప్రొడక్షన్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మించారు. మేజర్ ముకుంద్ వరద రాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘అమరన్’ దీపావళి కానుకగా అక్టోబర్ 31న తెలుగు(Telugu), తమిళ(Tamil), మలయాళ(Malayalam) భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. అలా రిలీజైన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా రూ.331 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే.. ‘అమరన్’ సినిమా రేపటి నుంచి(డిసెంబర్ 5) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పటి వరకు థియేటర్లలో అమరన్ మూవీ చూడని వారు రేపటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో చూసేయండి.

Tags:    

Similar News