శాంతిని సహించలేకపోతున్నారు..ఉగ్రదాడిపై రజినీకాంత్
పహల్గామ్ ఘటనపై సినీహీరో రజినీకాంత్ స్పందించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొనడాన్ని శతృవులు చూసి సహించలేకపోతున్నారని

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఘటనపై సినీహీరో రజినీకాంత్ స్పందించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొనడాన్ని శతృవులు చూసి సహించలేకపోతున్నారని అన్నారు. అందుకే ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడిలో చనిపోయినవారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. దాడి చేసిన ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తూ ఉండటంతో ఆ దేశానికి గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్దమైంది. సింధూ జలాలను పాకిస్థాన్ కు వెళ్లకుండా అడ్డుకుంటామని స్పష్టం చేసింది. పాకిస్థాన్ పౌరులు ఇండియా విడిచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు సరిహద్దుల్లో యుద్దవాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా యుద్దం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.