Pushpa-2: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. పుష్ప-2 ఆ ఫార్మాట్‌లో రిలీజ్ అవ్వట్లేదట..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు పుష్ప-2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Update: 2024-12-04 08:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు పుష్ప-2 (Pushpa) కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన ఈ మూవీ మరికొన్ని గంటల్లో ప్రీమియం షోలు ప్రారంభమవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక రేపు (డిసెంబరు 5) వరల్డ్ వైడ్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) అండ్ రష్మిక మందన్న(Rashmika Mandanna) కీలక పాత్రలో మెరిసిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అవ్వనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చేసుకున్నారు బన్నీ ఫ్యాన్స్. విడుదలకు ముందే పుష్ప రెండో భాగం రికార్డు క్రియేట్ చేస్తుందనడంలో అతిశయోక్తిలేదు.

ఇకపోతే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫార్మేట్స్‌(formats)(ఐమ్యాక్స్‌, డాల్బీ, డిబాక్స్‌, 4డీఎక్స్‌, 2డీ, 3డీ )(IMAX, DOLBY, DBOX, 4DX, 2D, 3D)లో విడుదల అవుతుందన్న సంగతి తెలిసిందే. కాగా సినీ ప్రేక్షకులు తమకు నచ్చిన ఫార్మెట్స్‌తో మూవీ వీక్షించేందుకు అడ్వాన్స్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు పుష్ప చిత్ర బృందం ఫ్యాన్స్ బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 3 డీ ఫార్మెట్‌లో పుష్ప-2 విడుదల కావడం లేదట. మరీ ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు. అయితే 3 డీ వర్షన్ కు తగ్గట్లుగా చిత్రీకరించారట.. కానీ పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు ఇంకా కొన్ని కంప్లీట్ అవ్వలేదట. దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిసపాయింట్ అవుతున్నారు. కానీ త్వరలోనే 3 డీ వర్షన్ విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపినట్లు సమాచారం. 


Also Read:

Pushpa-2 విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు లీక్..! 

Tags:    

Similar News