ఈ క్షణం కోసం ఎదురుచూశా.. రామ్ చరణ్ సినిమాపై డ్రెస్ డిజైనర్ షాకింగ్ కామెంట్స్!
రామ్‌చరణ్ చిత్రానికి పనిచేసే అవకాశం రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అంటున్నాడు డ్రెస్ డిజైనర్ ఏకాంబర మేగన్.
దిశ, సినిమా: రామ్‌చరణ్ చిత్రానికి పనిచేసే అవకాశం రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అంటున్నాడు డ్రెస్ డిజైనర్ ఏకాంబర మేగన్. రామ్‌చరణ్-బుచ్చిబాబు కలయికలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగాయి. వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీలో చరణ్ ఓ గ్రామీణ క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడని తెలిసింది. ఇటీవల ఈ చిత్రం మేకోవర్ కోసం శిక్షణ పొందుతున్న రామ్‌చరణ్ ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో లెటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా కోలీవుడ్‌కు చెందిన ఏకాంబర మేగన్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ''తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న నా కోరిక ఇన్నాళ్లకు తీరబోతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సానకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రామ్‌చరణ్ సినిమాకు పనిచేయడం ఎంతో ఎక్జ్సయిటింగ్‌గా ఉంది. తమిళం నుండి తెలుగు సినిమాకు వస్తున్న నేను తెలుగు సినిమా ద్వారా మరిన్ని విషయాలు నేర్చుకుంటాను' అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు ఏకాంబర మేగన్.