వావ్ ఈ తారల బొమ్మలు చూశారా.. వాళ్ళు ఎవరో గుర్తుపట్టండి..

ఐశ్వర్యరాయ్ అందం గురించిన చర్చలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

Update: 2024-09-20 06:34 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : ఐశ్వర్యరాయ్ అందం గురించిన చర్చలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే మరికొంతమంది బాలివుడ్ హీరోయిన్ల అందాల గురించి కూడా వర్ణిస్తుంటారు. వారి నటనతో, అభినయంతో అభిమానులను ఆకట్టుకుంటారు. అలాంటి కొన్ని అందాల రాశుల బొమ్మలు ఇప్పుడు మార్కెట్లోకి తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల విడుదలైన ఐశ్వర్యరాయ్ బొమ్మ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి హాజరైనప్పుడు ఆమె ధరించిన దుస్తుల నుండి ఈ బొమ్మ ప్రేరణ పొందింది. ఈ నటి బొమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య కంటే ముందు కత్రినా కైఫ్, తైమూర్ అలీఖాన్‌ల బొమ్మలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి.


ఐశ్వర్యరాయ్ బొమ్మ..

ప్రస్తుతం మార్కెట్లోకి విడుదలైన ఐశ్వర్య రాయ్ బొమ్మల గురించి మాట్లాడితే సోషల్ మీడియా వినియోగదారులు ఆమె బొమ్మలను చాలా ట్రోల్ చేస్తున్నారు. ఈ నటి బొమ్మను శ్రీలంక కళాకారుడు నిగిటేషన్ తయారు చేశారు. ఈ బొమ్మకు ఐశ్వర్యలా కనిపించేందుకు తన శాయశక్తులా ప్రయత్నించాడు. ఆయన శ్రమను కొందరు కొనియాడుతుండగా, మరికొందరు ఎగతాళి చేస్తున్నారు. ఐశ్వర్య బొమ్మ రెడ్ కలర్ అనార్కలి సూట్‌లో కనిపిస్తుంది. ఈ బొమ్మకు సంబంధించి ప్రజలు రకరకాల కామెంట్లు చేస్తూనే ఉన్నారు.


తైమూర్ బొమ్మను చూసి కరీనాకు కోపం వచ్చింది..

ఐశ్వర్య రాయ్ కంటే ముందు, కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ పెద్ద కుమారుడు తైమూర్ అలీ ఖాన్ బొమ్మలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. దీని పై కూడా చాలా మంది ప్రజలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తైమూర్ పుట్టినప్పటి నుంచి హెడ్‌లైన్స్‌లో భాగమైంది. స్టార్ కిడ్స్ పరంగా తైమూర్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జెహ్ పుట్టే వరకు, తైమూర్‌ను చూడాలని అభిమానులు తహతహలాడారు. తైమూర్‌కు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని, అతని బొమ్మలు కూడా మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. అయితే అభిమానులు ఆ బొమ్మలను ఇష్టపడుతుండగా, కరీనా కపూర్ ఖాన్ దాని పై చాలా కోపంగా ఉంది.

సుమారు 5 సంవత్సరాల క్రితం కరీనా ఒక టాక్ షోకి చేరుకున్నారు. అప్పుడే తైమూర్ బొమ్మలు మార్కెట్లోకి రావడం ప్రారంభించాయి. దీంతో ఆ షోలో నటిని తన కొడుకు బొమ్మల గురించి అడిగారు. దాంతో కరీనా ఈ బొమ్మ తైమూర్‌లా కనిపించడం లేదని చెప్పింది. ఈ బొమ్మ చక్కీలా కనిపిస్తుందని తెలిపారు. ఈ చక్కీ ఒక హాంటెడ్ డాల్. ఇది 'చైల్డ్ ప్లే' అనే హారర్ ఫిల్మ్‌లో కనిపించింది.


దీపికా పదుకొణె బొమ్మల పై కూడా మీమ్స్..

దీపికా పదుకొణె స్ఫూర్తితో కూడా కొన్ని బొమ్మలు మార్కెట్‌లోకి వచ్చాయి. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్‌ల 'పద్మావత్' సినిమా విడుదలైనప్పుడు, దీపికా లుక్ చాలా నచ్చింది. ఆ సమయంలోనే దీపికా డాల్ ను విడుదల చేశారు. ఆ బొమ్మను 'పద్మావత్' సినిమాలో ఉన్న దీపికా మేకప్ తో విడుదల చేశారు. దీపిక బొమ్మ చాలా మందికి నచ్చినప్పటికీ, కొందరు మాత్రం ఇది దీపికలా కనిపించడం లేదని అన్నారు.


కత్రినా బొమ్మలు..

కెరీర్ ప్రారంభం నుంచి కత్రినా కైఫ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కత్రినా అందాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్టెల్ కంపెనీ ఆమె బార్బీ బొమ్మను తయారు చేసింది. ఒక అమెరికన్ కంపెనీ తన బార్బీ బొమ్మను తయారు చేసిన మొదటి హిందీ సినిమా నటి కత్రినా. కత్రినా కంటే ముందు, అంతర్జాతీయ నటీమణులు మార్లిన్ మన్రో, షకీరా, ఆడ్రీ హెప్బర్న్, హెడీ క్లమ్, ఎలిజబెత్ టేలర్‌లకు ఈ గౌరవం లభించింది. కత్రినా బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి.


Similar News