స్టార్ హీరోకు భార్య కావాల్సిన సిమ్రాన్.. సినీ ఇండస్ట్రీకి ఎందుకు దూరమైందో తెలుసా?
ఒక్క మగాడు అనే పాట అందరికీ సుపరిచితమే. ఇక ఈ పాటలో ఉన్న సిమ్రాన్‌ను ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు.నువ్వు వస్తావని, సీతయ్య, డాడీ ఇలా చాలా సినిమాల్లో , స్టార్ హీరోస్ అందరి సరసన ఆడిపాడింది ఈ నటి.
దిశ, ఫీచర్స్ : ఒక్క మగాడు అనే పాట అందరికీ సుపరిచితమే. ఇక ఈ పాటలో ఉన్న సిమ్రాన్‌ను ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు.నువ్వు వస్తావని, సీతయ్య, డాడీ ఇలా చాలా సినిమాల్లో , స్టార్ హీరోస్ అందరి సరసన ఆడిపాడింది ఈ నటి.
అంతే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ నటికి మంచి క్రేజ్ ఉండేది. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయేది. కాగా, తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఈ నటి టాలీవుడ్లో ఓ స్టార్ హీరోకు భార్యకావాల్సిందంట. కానీ కొన్ని కారణాల వలన తాను ఆ హీరోకు దూరమైదంట.
అసలు విషయంలోకి వెళితే.. స్టార్ హీరో, సిమ్రాన్‌తో ప్రేమలో పడ్డాంట. వీరు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట. ఇక ఇలా కొన్ని రోజులు గడిచాక, వీరి ప్రేమాయణం వారింట్లో చెప్పడంతో, హీరో తండ్రి వారి పెళ్లికి ఒప్పుకోలేదంట. ఇండస్ట్రీలో ఉన్న హీరోస్‌ను అస్సలే నమ్మకూడదు అని చెప్పడంతో, అలాగే వారి పెళ్లికి అస్సలే ఒప్పుకోకపోవడంతో అలా వారిద్దరూ విడిపోయారంట. ఇక ఆ తర్వాత సిమ్రాన్ వేరే అతన్ని పెళ్లి చేసుకొని, సినీ ఇండస్ట్రీకి దూరమైనదంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.