రామోజీరావు తొలి ఉద్యోగం ఏంటో తెలుసా?

చెరుకూరి రామోజీరావు భారతీయ వ్యాపార వేత్త, ఈనాడు గ్రూప్స్ అధినేత, తెలుగు దినపత్రిక ఈనాడు వ్యవస్థాపకు, ప్రధాన సంపాదకుడు, ప్రచురన కర్త, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలు వ్యాపార సంస్థల అధినేత

Update: 2024-06-08 03:58 GMT

దిశ, సినిమా : చెరుకూరి రామోజీరావు భారతీయ వ్యాపార వేత్త, ఈనాడు గ్రూప్స్ అధినేత, తెలుగు దినపత్రిక ఈనాడు వ్యవస్థాపకు, ప్రధాన సంపాదకుడు, ప్రచురన కర్త, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలు వ్యాపార సంస్థల అధినేత. వ్యాపారంలో ఓ హిస్టరీ క్రియేట్ చేసిన రామోజీరావు ఈరోజు(శని వారం) ఉదయం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఈయన మృతిపట్ల రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఎంతో మంది సంతాపం తెలుపుతున్నారు.

అయితే ఎన్నో సంస్థలకు అధినేత అయిన రామోజీరావు మొదటి ఉద్యోగం ఏంటో చాలా తక్కువ మందికి తెలుసు. కాగా, ఈయన మొదటి ఉద్యోగం ఏంటీ? తాను వ్యాపార రంగంలోకి ఎలా అడుగు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయ కుటంబంలో జన్మించిన రామోజీరావు, గుడి వాడ కళశాలలో ఇంటర్, బీఎస్సీ పూర్తి చేశారు. తర్వాత తన కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కూమార్తె రమాదేవిని వివాహం చేసుకున్నారు.

ఈయనకు అడ్వర్టైజింగ్ అంటే ఆసక్తి ఎక్కువ. దీంతో రామోజీరావు తనకు పరిచయస్తుడు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైన తహశిల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగం గురించి నేర్చుకోవాలి అనుకున్నాడు. అందుకోసం చదువు పూర్తి అయ్యాక ఢిల్లీలోని ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఆయన తొలిసారి ఉద్యోగంలో చేరాడు. అదే ఆయన మొదటి ఉద్యోగం. మూడు సంవత్సరాలు అందులో పని చేసిన తర్వాత, రామోజీరావు హైదరాబాద్‌కు వచ్చాడు. తర్వాత ఆయన వ్యాపారం చేయాలని నిర్ణియించుకున్నాడు. అలా 1962లో మార్గదర్శి చిట్స్ ప్రారంభించారు. ఇదే ఆయన జీవితంలో తొలి వ్యాపారం. తర్వతా కిరణ్ యాడ్స్ అడ్వర్టైజ్ మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. తర్వాత వసుంధర ఫర్టిలైజర్స్, అన్నదాత పత్రిక, ఈనాడు, ఊషాకిరణ్ మూవీస్, కళాంజలి, ప్రియా ఫఉడ్స్, ఈటీవీ, ఈనాడు, వసుంధర పబ్లికేషన్స్ ఇలా ఎన్నింటినో స్థాపించి వ్యాపారవేత్తగా రికార్డ్ క్రియేట్ చేశారు.


Similar News