సృష్టించుకొని, తన పేరు తానే పెట్టుకున్న రామోజీరావు.. ఆయన అసలు పేరు ఏమిటంటే?

ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు రామోజీరావు గురించి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో ఆయన పేరు ఒకటి. ప్రతి ఒక్కరి జీవితంలో తమ తల్లిదండ్రులు పేరు పెడుతారు. కానీ రామోజీరావు మాత్రం తన పేరు తానే పెట్టుకొని

Update: 2024-06-08 04:46 GMT

దిశ, సినిమా : ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు రామోజీరావు గురించి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో ఆయన పేరు ఒకటి. ప్రతి ఒక్కరి జీవితంలో తమ తల్లిదండ్రులు పేరు పెడుతారు. కానీ రామోజీరావు మాత్రం తన పేరు తానే పెట్టుకొని, ఆ పేరుతో రికార్డ్స్ క్రియేట్ చేశారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే? ఆయన స్థాపించిన సంస్థలు, ఆయన వ్యాపారాలు, తాను ఎంతో మందికి ఉపాధిని ఇచ్చిన తీరు ఇవన్నీ ఆయన ఆలోచన ఫలితమే. అయితే రామోజీరావు తన పేరు తానే ఎందుకు పెట్టుకున్నారు, ఆయన అసలు పేరు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1936లో నవంబర్ 16న గుడివాడ కృష్ణా జిల్లాలో ఓ రైతుకుటుంబంలో జన్మించారు. ఈయన తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. వీరిది వ్యవసాయాధారిత కుటుంబం. రామోజీరావు పూర్వీకు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందగా, అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తన తాత రామయ్య మరణించిన 13 రోజులకు జన్మించాడు. దీంతో కుటుంబ సభ్యులు తన తాత జ్ఞాపకార్థం రామోజీకి రామయ్య అనే పేరు పెట్టారు. కానీ ఈ పేరు అంటే రామోజీరావుకు అస్సలు నచ్చక పోయేది. అందుకే తాను ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడే సొంతంగా తన పేరును తానే సృష్టించుకొని, రామోజీరావు అని పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతం కొనసాగుతూ వచ్చింది. అలా రామోజీరావు తన పేరు తానే పెట్టుకున్నారు.


Similar News