ఆ కోరిక తీరకుండానే రామోజీరావు మరణించారా?.. ఆయన చివరి కోరిక ఏమిటంటే?

టాలీవుడ్‌లో రామోజీరావు పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఆయన వ్యాపార వేత్తగా , నిర్మాతగా చూడని విజయాలు లేవు. తన సంస్థల ద్వారా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఎంతో మంది యువనటులను హీరోలుగా పరిచయం చేసి

Update: 2024-06-08 03:15 GMT

దిశ, సినిమా : టాలీవుడ్‌లో రామోజీరావు పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఆయన వ్యాపార వేత్తగా , నిర్మాతగా చూడని విజయాలు లేవు. తన సంస్థల ద్వారా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఎంతో మంది యువనటులను హీరోలుగా పరిచయం చేసి వారిని పాన్ ఇండియా స్టార్స్‌గా మార్చిన ఘనత రామోజీరావుకే సొంతం. ఈ ఉషా కిరణాలు.. అనే పదం వింటే చాలా అది మనసుకు ఎంతో హాయనిస్తుంది. ఆరోజుల్లో ప్రతి సినిమా ముందు ఈ లిరిక్ వినిపించేది. ఆయన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్ట్‌లను పరిచయం చేశారు. ఈయన బ్యానర్‌లో వచ్చిన సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్, ఉదయకిరణ్ తన ట్యాలెంట్‌ను నిరూపించుకుని స్టా్ర్స్‌గా మారారు. అంతే కాకుండా సీరియల్స్, సినిమాల ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులకు మంచి లైఫ్ ఇచ్చారు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తమ జర్నీ మొదలు పెట్టి ఎంతో మంది స్టార్స్‌గా మారిపోయారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈయన పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇక రామోజీరావు ఈరోజు ఉదయం తన తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన తన కోరిక తీరకుండానే మరణించారంట. అది ఏమిటంటే? ఆయనకు ఎంతో ఇష్టమైన ఉషా కిరణ్ బ్యానర్‌లో వంద సినిమాలు తీయాలని ఎప్పుడూ అనుకునేవాడంట, కానీ ఇప్పటికీ ఆయన 95 సినిమాలేమో తెరకెక్కించారు. వంద సినిమా అనేది ఆయన తీరని కోరికగానే మిగిలిపోయింది అంటున్నారు తన అభిమానులు.


Similar News